ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు (somu veerraju) అమరావతిపై (Amaravati) కీలక వ్యాఖ్యలు చేశారు.  అమరావతిని బీజేపీ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని చెప్పారు. బీజేపీ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదాకు సమానంగా రాష్ట్రానికి నిధులు తెస్తామని అన్నారు. 


ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు (somu veerraju) అమరావతిపై (Amaravati) కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతిని బీజేపీ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని చెప్పారు. బీజేపీ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదాకు సమానంగా రాష్ట్రానికి నిధులు తెస్తామని అన్నారు. రూ. 10 వేల కోట్లతో రాజధానిని అభివృద్ది చేస్తామని చెప్పారు. గత ప్రభుత్వం కానీ, ఈ ప్రభుత్వం గానీ రాష్ట్ర అభివృద్దికి ఏం చేసిందేమి లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దిశ లేని ఆలోచనలు చేస్తుందని విమర్శించారు. రాజధానిని నిర్మించడంలో మాజీ సీఎం చంద్రబాబు విఫలమయ్యారని విమర్శించారు.

సోమవారం పెనుగంచిప్రోలులో తిరుపతమ్మ దేవాలయం సందర్శించిన సోము వీర్రాజు ఆలయంలో పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో 2024లో తమ పార్టీ అధికారంలోకి వస్తుందని సోము వీర్రాజు ధీమా వ్యక్తం చేశారు. 10 వేల కోట్ల రూపాయలతో అమరావతి అభివృద్ది చెందుతుందని రైతులు చెప్పారని అన్నారు. 10 వేలు కోట్ల రూపాయలు మూడేళ్లలో కేటాయించి.. అమరావతి అద్భుతమైన రాజధానిని నిర్మిస్తున్నట్టుగా అమ్మవారి టెంపుల్‌లో ప్రకటిస్తున్నానని చెప్పారు. గుంటూరులోని టవర్‌కు జిన్నా పేరు తొలగించి.. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. మద్యం ధరలపై తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని అన్నారు.