వచ్చే ఎన్నికల్లో జిల్లాలోని మొత్తం 10 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్ధానాలను గెలుచుకోవాలని చెప్పారు. అదేమంత పెద్ద విషయం కూడా కాదని తేల్చేసారు. మొన్నటి ఎంఎల్సీ ఎన్నికల్లో స్వయానా వైఎస్ రాజశేఖరరెడ్డి తమ్ముడు వైఎస్ వివేకానందరెడ్డిని ఓడించిన సంగతిని సోమిరెడ్డి గుర్తు చేసారు.

కడప జిల్లాకు ఇన్ఛార్జిమంత్రిగా నియమితులైన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి బాగా రెచ్చిపోతున్నారు. శుక్రవారం కడపలో జరిగిన పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో రెచ్చిపోయి మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో జిల్లాలోని మొత్తం 10 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్ధానాలను గెలుచుకోవాలని చెప్పారు. అదేమంత పెద్ద విషయం కూడా కాదని తేల్చేసారు. మొన్నటి ఎంఎల్సీ ఎన్నికల్లో స్వయానా వైఎస్ రాజశేఖరరెడ్డి తమ్ముడు వైఎస్ వివేకానందరెడ్డిని ఓడించిన సంగతిని సోమిరెడ్డి గుర్తు చేసారు. వివేకానే ఓడించిన తర్వాత మిగిలిన వాళ్లు ఓ లెక్కా అన్నట్లుగా మాట్లాడటం గమనార్హం.

పార్టీ మొత్తం ఏకతాటిపై నడిస్తే వైసీపీ అభ్యర్ధులను ఓడించటం పెద్ద కష్టమేమీకాదన్నారు. మొన్నటి ఎంఎల్సీ ఎన్నికల్లో టిడిపి అభ్యర్ధి బిటెక్ రవి ఏవిధంగా గెలిచారో అందరూ చూసిందే కదా? స్వయంగా ముఖ్యమంత్రి ప్రతీరోజూ టెలికాన్ఫరెన్సులు పట్టి, లక్ష్యాలను నిర్దేశించి, క్యాంపులు ఏర్పాటుచేసి, కోట్ల రూపాయలు ఖర్చుపెడితే గానీ గెలవలేకపోయారు. అదికూడా 33 ఓట్ల మెజారిటీతో. అదంతా సోమిరెడ్డి మరచిపోయినట్లున్నారు.

పార్టీ ద్వారా పదవులు పొందినవారు అలంకారప్రాయంగా ఉండకూడదన్నారు. రాజ్యసభ సభ్యునిగా ఉన్న సిఎం రమేష్ ఏనాడూ ప్రత్యక్ష రాజకీయాల్లో లేరు. ఎప్పడూ తెరవెనుక రాజకీయాలే నడుపుతుంటారు. ఆ విషయం సోమిరెడ్డికి గుర్తుకులేదోమే. పార్టీ అభివృద్ధికి కష్టపడిన వారే పార్టీలో ఉండేందుక అర్హులట.

వైసీపీ నుండి ఫిరాయించి వచ్చిన ఆదినారాయణ రెడ్డి టిడిపి కోసం ఏం కష్టపడ్డారని చంద్రబాబు ఏకంగ మంత్రిని చేసేసారు? పైగా పార్టీ కోసం దశాబ్దాలుగా కష్టపడిన రామసుబ్బారెడ్డి పరిస్ధితి ఏమైందో అందరికీ తెలిసిందే? పైగా వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటున్నారట. కేంద్రంతో మాట్లాడి నిధులు, ప్రాజెక్టులను సాధించుకురాలేక విఫలమవుతున్నది చంద్రబాబే. చివరకు విభజన చట్టంలో పేర్కొన్న ప్రయోజనాలను కూడా సాధించుకురాలేక చేతులెత్తేసారు.

వైసీపీ ఎంఎల్ఏలకు సామాన్య జనాలతో మాట్లాడటం కూడా తెలియదట. దోచుకున్న డబ్బుతో జగన్ కాలక్షేపం కోసం పార్టీ నడుపుతున్నారని సోమిరెడ్డి చెప్పటం ఆశ్చర్యంగా ఉంది. ఒకవేళ నిజంగా జగన్ లక్ష కోట్లు దోచుకున్నా కాలక్షేపం కోసం పార్టీని పెడతారా? కుటుంబాన్ని వదిలిపెట్టి జనాల మధ్యలోనే తిరుగుతుంటారా? ప్రజల కోసం తమ ప్రభుత్వం ఏం చేస్తోందో చెప్పుకుంటే తప్పులేదు కానీ ప్రతిపక్షంపై నోరు పారేసుకోవటం గమనార్హం.