జగన్ పై సోమిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

somireddy sensational comments on jagan
Highlights

వైఎస్ వల్లే కాలేదు.. నీ వల్ల ఏమౌతుందన్న సోమిరెడ్డి

మంత్రి సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబును జైలుకు పంపించడం మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి వల్లే కాలేదని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. అమరావతిలో ప్రెస్‌మీట్‌లో ఆయన వైసీపీ అధినేత జగన్‌పై నిప్పులు చెరిగారు. చంద్రబాబును ఏ వన్‌గా జగన్ పరిగణించడంపై ఆయన తీవ్రంగా స్పందించారు. 12 కేసుల్లో ఏ వన్ గా జగన్... చంద్రబాబును విమర్శించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. గుడివాడ సభలో చిన్నా, పెద్దా, సీఎం హోదా అనేవి మర్చిపోయి జగన్ రెచ్చిపోయాడని అన్నారు.
 
ఐదున్నరేళ్లలో రాష్ట్రాన్ని దోచుకుని, వ్యవస్థను బ్రష్టు పట్టించింది మీరు కాదా అని వైయస్‌ను ఉద్దేశించి ప్రశ్నించారు. కేసులకోసం ఆత్మగౌరవాన్ని మోడీకి జగన్ తాకట్టు పెట్టారని ఆరోపించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రైతులకు మేలు చేసి, ఏపీ రైతులకు కేంద్రం అన్యాయం చేస్తుందని కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. బీజేపీ నేతలు బరితెగించి ఇష్టమొచ్చిన భాష మాట్లాడుతున్నారని, కర్ణాటక ఎన్నికల్లో కోట్లు పంచి బీజేపీ గెలవడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఆంధ్రా ప్రజల కోసం మోదీని నిలదీసిన వారు హీరో అని సోమిరెడ్డి పేర్కొన్నారు.

loader