వైఎస్ కు ఆరు పెళ్లిళ్లు అయ్యాయి: జగన్ కు సోమిరెడ్డి కౌంటర్

https://static.asianetnews.com/images/authors/26af83d2-0ed6-5e66-b49b-5078caf01292.jpg
First Published 22, Aug 2018, 1:37 PM IST
Somireddy retaliates YS Jagan marraige comments
Highlights

వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన పెళ్లిళ్ల కామెంట్లపై ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. జగన్ కు ఈ మధ్య  పెళ్లిళ్ల యావ ఎక్కువైందన్న సోమిరెడ్డి అతని తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎన్ని పెళ్లిళ్లు చేసుకున్నారో తెలుసుకోవాలన్నారు. 2004 ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి దాదాపు ఆరు పెళ్లిళ్లు చేసుకున్నారన్నారు. 
 

అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన పెళ్లిళ్ల కామెంట్లపై ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. జగన్ కు ఈ మధ్య  పెళ్లిళ్ల యావ ఎక్కువైందన్న సోమిరెడ్డి అతని తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎన్ని పెళ్లిళ్లు చేసుకున్నారో తెలుసుకోవాలన్నారు. 2004 ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి దాదాపు ఆరు పెళ్లిళ్లు చేసుకున్నారన్నారు. 

తాజాగా జగన్ ప్రధాని నరేంద్రమోదీతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని ఆరోపించారు. ప్రధాని నరేంద్రమోదీతో 45నిమిషాల పాటు జగన్ ఏం చర్చలు జరిపారో తెలపాలి.. 

ఈమధ్య జగన్ చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే తన పరిధి దాటి మాట్లాడుతున్నారన్నారు. జగన్ కు రాజకీయ సిద్ధాంతాలు ఏమీ తెలియవని...వైసీపీకి స్వప్రయోజనాలే తప్ప ప్రజల సంక్షేమం పట్టదన్నారు. రాష్ట్రం నాశనం అవ్వాలనే జగన్ ఆలోచన అని దుయ్యబుట్టారు. 
 
రాష్ట్ర, దేశ ప్రయోజనాలే ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో పొత్తు ఉంటుందని తేల్చిచెప్పారు.అయితే  రాష్ట్రానికి అన్యాయం చేసిన బీజేపీ అధికారంలోకి రాకుండా చేయడమే తమ టార్గెట్ అన్నారు. తాము బీజేపీపై పోరాటం చేస్తున్నామని అయితే జగన్ యాంటీ బీజేపీ అని ప్రకటించగడా అని ప్రశ్నించారు.  

ఈ వార్తలు కూడా చదవండి

కాబోయే ప్రధానిని నిర్ణయించేది ఆ పార్టీయేనట..  

చంద్రబాబు'పెళ్లిళ్లపై' జగన్ వ్యాఖ్యలు: అమరావతి బాండ్లపై ఆరోపణ

 

 

loader