Asianet News TeluguAsianet News Telugu

కాబోయే ప్రధానిని నిర్ణయించేది ఆ పార్టీయేనట......

కాబోయే ప్రధానిని నిర్ణయించేది తెలుగుదేశం పార్టీయేనని ఏపీ ఆర్థిక శాఖ  మంత్రి యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో ఏర్పడేది నాన్ కాంగ్రెస్ నాన్ బీజేపీ కేంద్రప్రభుత్వం ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు

yanamala ramakrishnudu comments on national politics
Author
Amaravathi, First Published Aug 22, 2018, 1:15 PM IST

అమరావతి: కాబోయే ప్రధానిని నిర్ణయించేది తెలుగుదేశం పార్టీయేనని ఏపీ ఆర్థిక శాఖ  మంత్రి యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో ఏర్పడేది నాన్ కాంగ్రెస్ నాన్ బీజేపీ కేంద్రప్రభుత్వం ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు. దేశంలో కాంగ్రెస్, బీజేపీ యేతర పార్టీలను ఏకం చేసింది తెలుగుదేశం పార్టీయేనన్నారు. 

రాబోయే ఎన్నికల్లో కేంద్రరాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ క్రియాశీలక పాత్ర పోషిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అత్యధిక స్థానాలతో అధికారంలోకి వస్తుందన్నారు. ఏ పార్టీ పంచన చేరాల్సిన దుస్థితి తెలుగుదేశం పార్టీకి లేదని తేల్చి చెప్పారు. 

జాతీయ రాజకీయాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను వైసీపీ ఇష్టం వచ్చినట్లు ప్రచారం చేయడం తగదన్నారు. గోబెల్స్ కూడా సిగ్గుపడేలా వైసీపీ అసత్యాలు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. టీడీపీని విమర్శించే నైతిక హక్కు వైఎస్ జగన్ కు లేదన్నారు. 

రాష్ట్ర ప్రయోజనాల కోసమే బీజేపీతో పొత్తు పెట్టుకున్నామన్నారు.  రాష్ట్రానికి కేంద్రప్రభుత్వం అన్యాయం చేయడంతో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చామని స్ఫష్టం చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios