Asianet News TeluguAsianet News Telugu

అలాగయితే... ఆనందయ్య మందు పంపిణీపై మళ్లీ కోర్టుకు: సోమిరెడ్డి హెచ్చరిక

ఇకనైనా ఆనందయ్య మందు పంపిణీపై రాజకీయాలు చేయొద్దని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, మాజీ మంత్రి  సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సూచించారు.

somireddy chandramohan reddy sensational comments on anandaiah medicine akp
Author
Nellore, First Published Jun 1, 2021, 3:57 PM IST

నెల్లూరు: ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆనందయ్య మందు పంపిణీ త్వరలోనే తిరిగి ప్రారంభం కానుందని... ఇకనైనా దీనిపై రాజకీయాలు చేయొద్దని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, మాజీ మంత్రి  సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సూచించారు. ఒకవేళ రాజకీయాలు చేద్దామనిచూస్తే తాము కోర్టుకి ఫిర్యాదు చేస్తామని సోమిరెడ్డి హెచ్చరించారు.

''ఆనందయ్య మందు పంపిణీ తిరిగి ప్రారంభం కావడానికి హైకోర్టు తీర్పు, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి చొరవే కారణం. స్థానిక ఎమ్మెల్యేనే ఆనందయ్యను నిర్బంధించి, మందు పంపిణీ అడ్డుకున్నారు. ఆయన నిర్వాకం కారణంగా దాదాపు లక్షమంది మందు దొరక్క ప్రాణాపాయస్థితిలో ఉన్నారు'' అని సోమిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. 

''ఆనందయ్యపై తప్పుడుకేసులు పెట్టిన స్థానిక పోలీసులు, ఎమ్మార్వోపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదు? స్థానిక జిల్లా కలెక్టర్, ఎస్పీలు రాజకీయ పార్టీలు, నాయకుల ప్రమేయం లేకుండా మందు పంపిణీ జరిగేలా చూడాలి. కంట్లో వేసే చుక్కలమందుపై కూడా ప్రభుత్వం 3వ తేదీన కోర్టుకి నివేదిక ఇవ్వాలి'' అని సోమిరెడ్డి డిమాండ్ చేశారు.

కరోనా థర్డ్ వేవ్ కు నెను రెడీ, రేపటి నుంచే మందు తయారీ: ఆనందయ్య

ఆనందయ్య కరోనా మందుకు నిన్ననే(సోమవారం) ప్రభుత్వం ఆంక్షలతో కూడిన అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. కంటిలో వేసే చుక్కుల మందుకు తప్ప మిగతా మందులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కంట్లో వేసే చుక్కల మందుకు అనుమతి నిరాకరించింది.  ఆనందయ్య మందులు హానికరం కాదని నివేదికలు వచ్చాయి. సిసిఆర్ఎఎస్ ఇచ్చిన నివేదిక మేరకు ప్రభుత్వం ఆనందయ్య మందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కంట్లో వేసే చుక్కల మందుపై ఇంకా నివేదికలు రావాల్సి ఉంది. 

ఆనందయ్య పంపిణీ చేస్తున్న పీ, ఎల్, ఎఫ్ అనేవాటికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే, ఆనందయ్య మందు వల్ల కరోనా తగ్గుతుందని గ్యారంటీ ఇవ్వలేమని ప్రభుత్వం స్పష్టం చేసింది. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ మందు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. కోవిడ్ రోగులు నేరుగా ఆనందయ్య వద్దకు వెళ్లవద్దని, వారికి సబంధించినవారు వెళ్లి మందులు తీసుకుని రావాలని సూచించింది. గతంలో ఆస్పత్రుల నుంచి ఆక్సిజన్ సిలిండర్లు వేసుకుని రోగులు ఆనందయ్య మందు కోసం వెళ్లిన నేపథ్యంలో ప్రభుత్వం ఆ ఆదేశాలు జారీ చేసింది. 

కంట్లో వేసే చుక్కల మందులో వాడుతున్న మూలికల వల్ల హాని జరగదని అధికారులు చెప్పారు. కంట్లో వేసే చుక్కల మందుపై నివేదికలు రావడానికి రెండు, మూడు వారాలు పట్టే అవకాశం ఉంది. వైద్యులు ఇచ్చిన మందులు వాడుతూ ఎవరి ఇష్టానుసారం వారు ఆనందయ్య మందులు వాడవచ్చునని ప్రభుత్వం స్పష్టం చేసింది.

 

Follow Us:
Download App:
  • android
  • ios