కరోనా థర్డ్ వేవ్ కు నెను రెడీ, రేపటి నుంచే మందు తయారీ: ఆనందయ్య
రేపటి నుంచి తాను మందు తయారు చేస్తానని బొనిగె ఆనందయ్య చెప్పారు. తాను కరోనా థర్డ్ వేవ్ కు కూడా సిద్ధపడినట్లు ఆయన తెలిపారు. పిల్లలకు మోతాదు తగ్గించి మందు వేస్తానని చెప్పారు.
నెల్లూరు: కరోనా వైరస్ థర్డ్ వేవ్ కు తాను సిద్ధంగా ఉన్నట్లు బొనిగె ఆనందయ్య చెప్పారు. పిల్లలకు మోతాదు తగ్గించి మందు ఇస్తానని ఆయన చెప్పారు. కరోనాకు ఆనందయ్య నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో మందు పంపిణీ చేసిన విషయం తెలిసిందే. కంట్లో వేసే మందుకు తప్ప మిగతా మందుల పంపిణీకి ప్రభుత్వం ఆనందయ్యకు అనుమతి ఇచ్చింది.
ఈ నేపథ్యంలో రేపటి నుంచి మందు తయారు చేస్తానని ఆయన చెప్పారు. తనకు అన్ని రాజకీయ పార్టీలు కూడా సహకరించాయని ఆయన చెప్పారు. ఇబ్బంది వల్ల ప్రభుత్వం 15 రోజుల పాటు మందు పంపిణీని ఆపేసినట్లు ఆయన తెలిపారు. ఇతర రాష్ట్రాలవారికి కూడా తాను మందు ఇస్తానని ఆయన చెప్పారు.
Also Read: ఆనందయ్య మందు ఎలా తయారు చేస్తాడో తెలుసా..?
తిరుపతిలో నిరుడు 500 మందికి తాను మందు ఇచ్చినట్లు ఆయన మంగళవారంనాడు చెప్పారు. తనకు సహాయం చేసేందుకు పలు స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చినట్లు ఆయన తెలిపారు. తమ నాన్న రైతు అని, తాను వ్యాపారం చేసేవాడినని ఆయన చెప్పారు.రియల్ ఎస్టేట్ వ్యాపారంలో తాను నష్టపోయినట్లు ఆయన తెలిపారు. వైద్యులను కించపరచడాన్ని ఆయన వ్యతిరేకించారు.
Also Read: అధికారులతో సంప్రదించిన తర్వాతే మందు పంపిణీ తేదీ ప్రకటిస్తా: ఆనందయ్య
కాగా, నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో పోలీసులు 144వ సెక్షన్ విధించారు. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ మందు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆనందయ్యను ఆదేశించింది. రోగులెవరూ రావద్దని, వారి సన్నిహితులు లేదా బంధువులు వచ్చి మందు తీసుకుని వెళ్లాలని కూడా సూచించింది.