ఫేస్ బుక్ ప్రెండ్ తో నగ్నంగా వీడియో కాల్ మాట్లాడి ఓసారి, పెళ్లి చేసుకుంటాడని నమ్మి మరొకడితో శారీరకంగా దగ్గరై మరోసారి... ఇలా ఇద్దరు యువకుల చేతిలో మోసపోయింది గుడివాడకు చెందిన ఓ యువతి.
గుడివాడ : సోషల్ మీడియా పరిచయాలు ఎలాంటి దారుణాలకు దారితీస్తున్నాయో చూస్తునే వున్నాం. ముక్కూమొఖం తెలియనివారితో స్నేహంచేసిన అనేకమంది మోసపోతున్న ఘటనలు నిత్యం వెలుగుచూస్తున్నాయి. కేవలం అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా సోషల్ మీడియా స్నేహాలతో మోసపోతున్నారు. ఇలా ఫేస్ బుక్ లో పరిచయమైన యువకుడి మాయలో పడిన ఓ యువతి నగ్నంగా వీడియో కాల్ మాట్లాడి మోసపోయింది. ఆ నగ్న వీడియో చూపించి యువతిని బ్లాక్ మెయిల్ చేయడమే కాదు పెళ్లి కూడా చెడగొట్టాడు సదరు సోషల్ మీడియా ఫ్రెండ్. ఈ ఘటన కృష్ణా జిల్లాలో వెలుగుచూసింది.
పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గుడివాడకు చెందిన ఓ యువతితో అదే ప్రాంతానికి చెందిన న్యూటన్ బాబు ఫేస్ బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. మొదట చాటింగ్ ఆ తర్వాత ఫోన్ నంబర్లు మార్చుకుని మాటలు మొదలయ్యాయి. ఇలా సోషల్ మీడియా పరిచయం కాస్తా ముదిరి ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధానికి దారితీసింది. ఈ క్రమంలోనే న్యూటన్ బాబు బలవంతం చేయడంతో యువతి నగ్నంగా వీడియో కాల్ మాట్లాడింది. దీంతో అప్పటివరకు మంచోడిలా నటిస్తూవచ్చిన అతడు తన అసలురంగు బయటపెట్టాడు.
Read More విశాఖపట్నంలో దిశ SOS ఎఫెక్ట్.. యువతి కాల్ చేయగానే వెంటనే స్పాట్‌కు దిశ టీం
యువతి నగ్న వీడియోను మొబైల్ లో సేవ్ చేసుకున్న న్యూటన్ బాబు బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు. ఈ క్రమంలోనే సదరు యువతికి గుర్రం పరంజ్యోతి అనే యువకుడితో పెళ్లి కుదిరింది. ఈ విషయం తెలిసిన న్యూటన్ బాబు యువతి వీడియోను పరంజ్యోతికి పంపించాడు. దీంతో అతడు పెళ్లి కుదిర్చిన పెద్దలకు ఈ వీడియో చూపించి పెళ్లికి నిరాకరించాడు. అయితే ఎలాగూ పెళ్లి చేసుకుంటున్నాం కదా తప్పేముంది అనుకున్న పరంజ్యోతి, యువతి శారీరకంగా దగ్గరయ్యారు. ఇప్పుడు వీడియో బయటపడగానే పెళ్లి క్యాన్సిల్ చేసుకోవడంతో యువతి మరోసారి మోసపోయింది.
ఇలా సోషల్ మీడియా స్నేహంతో ఓసారి, పెళ్లిపేరుతో మరోసారి యువతి మోసపోయింది. దీంతో ఆమె కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు నగ్న వీడియోలను అందరికీ షేర్ చేసిన న్యూటన్ బాబుపై అత్యాచారయత్నం, పెళ్లిచేసుకుంటానని నమ్మించి అత్యాచారానికి పాల్పడిన పరంజ్యోతిపై అత్యాచారం కేసు నమోదు చేసారు. మరికొందరు కూడా యువతి నగ్న వీడియోను షేర్ చేయడంతో వారిని కూడా పోలీసులు అరెస్ట్ చేసారు. ఇలా అరెస్టయిన అందరినీ కోర్టులో హాజరుపర్చి రిమాండ్ కు తరలించారు పోలీసులు.
