అనంతపురంలో కలకలం రేపిన ఎస్ బిఐ ఉద్యోగి స్నేహలత హత్య కేసులో  పోలీసులు ఇద్దిని అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు గుత్తి రాజేష్, ఇతని స్నేహితుడు సాకే కార్తీక్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

వీరితో పాటు వీరు వినియోగించిన అపాచీ బైకు, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ధర్మవరం మండలం బడన్నపల్లి పొలాల్లో స్నేహలత హత్యకు గురైన ఘటనలో ఇద్దరు నిందితులను అరెస్టు చేశామని ధర్మవరం డీఎస్పీ రమాకాంత్ తెలిపారు. 

స్నేహాలత హత్య కేసు : జగన్ రెడ్డి నిర్లక్ష్యమే వారి పాలిట శాపంగా మారింది.. నారా లోకేష్..(వీడియో)...

అనంతపురంలోని అశోక్ నగర్ కు చెందిన గుత్తి రాజేష్ (23), ఇతని స్నేహితుడు సాకే కార్తీక్ (28) అరెస్టు చేసి ఈరోజు కోర్టు ముందు హాజరు పరచనున్నామని పేర్కొన్నారు. ఈ కేసులో గుత్తి రాజేష్ ప్రధాన నిందితుడన్నారు. 

ఇతని స్నేహితుడైన సాకే కార్తీక్ ప్రోద్భలం కూడా ఇందులో ఉందన్నారు. గుత్తి రాజేష్ ను సాకే కార్తీక్ ప్రేరేపించాడన్నారు. ధర్మవరం నుండి స్నేహలతను నేర స్థలం వరకు ఎక్కించుకొచ్చిన అపాచీ వాహనాన్ని, ప్రధాన నిందితుడు వినియోగించిన 3 సెల్ ఫోన్లతో పాటు మరో ఫోన్ కలిపి 4 సెల్ ఫోన్లు సీజ్ చేశామన్నారు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలోఎస్బీఐ ఉద్యోగిని దుండగులు హత్య చేసి ఆమె శవాన్ని కాల్చేశిన సంగతి తెలిసిందే. ఈ సంఘటన అనంతపురం జిల్లా ధర్మవరం మండలం బడన్నపల్లిలో జరిగింది.

అనంతలో దారుణం: ఎస్బీఐ ఉద్యోగినిని చంపేసి, శవాన్ని కాల్చేశారు...

మృతురాలిని స్నేహలతగా గుర్తించారు. ఆమె అనంతపురంలోని ఎస్బీఐలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగినిగా పనిచేస్తోంది. బైక్ మీద ప్రతి రోజూ వెళ్లి వస్తోంది. స్నేహలత కనిపించడం లేదని కుటుంబ సభ్యులు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుర్తింపు కార్డు ఆధారంగా ఆమెను గుర్తించారు. ఓ యువకుడిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గల కారణాలు ఇప్పటి వరకు తెలియరాలేదు. స్థానికంగా ఈ ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది.