Asianet News TeluguAsianet News Telugu

26రోజులు పూజలు అందుకున్న పాము.. చనిపోయింది

దీంతో గ్రామస్థులు విషాదంలో మునిగిపోయారు. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. త్వరలోనే పాము చనిపోయిన దగ్గర గుడి కడతామని గ్రామస్థులు చెబుతున్నారు.

snake died in durgada

గత 26 రోజులుగా తూర్పుగోదావరి జిల్లా దుర్గాడలో గ్రామస్థులతో పూజలు అందుకున్న నాగుపాము కన్నుమూసింది.  పాముని సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వామిగా భావిస్తూ.. 26 రోజులపాటు పూజలు నిర్వహించారు. కాగా.. అకస్మాత్తుగా పాము మృత్యువాత పడింది. దీంతో గ్రామస్థులు విషాదంలో మునిగిపోయారు. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. త్వరలోనే పాము చనిపోయిన దగ్గర గుడి కడతామని గ్రామస్థులు చెబుతున్నారు.

26 రోజుల క్రితం ఒక పొలం దగ్గర కనిపించిన ఆ పామును గ్రామస్తులు సుబ్రహ్మణ్యం స్వామి స్వరూపం అంటూ దైవంలా కొలిచారు. పాము దగ్గరికి వెళ్లి చేతులెత్తి మొక్కారు. అయితే పాము వారి శరీరంపై పాకుతూ కాటు వేయకపోవడం గమనార్హం. నాలుగు వారాలుగా అక్కడే ఉన్న పాము కొద్ది రోజులు నీరసంగా కనిపించినప్పటికీ... త్వరగా యాక్టివ్ అయ్యింది.

నిన్ననే కుసుం విడిచిన పాము.. అనుకోకుండా ఒక్కసారిగా కన్నుమూసింది. పాము ఈ ప్రాంతంలో ఉండటం దాని ఆరోగ్యానికి మంచిది కాదని చెప్పినా.. గ్రామస్థులు వినలేదు. దాని ఫలితమే ఇలా జరిగి ఉంటుందని వారు భావిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios