కృష్ణా జిల్లాలోని ఘంటసాల మండలంలో  కట్ల పాము కలకలం రేపింది. పాప వినాశనం గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు పిల్లలను కట్ల పాము కాటు వేసింది. ఇంట్లో నిద్రపోతున్న చిన్నారులను పాము కాటు వేయడం గమనార్హం.

 పూర్తి వివరాల్లోకి వెళితే... ఘంటసాల మండంలం గొల్లపాలెం గ్రామంలో ఒకే ఇంట్లో ముగ్గురు పిల్లల్ని క‌ట్లపాము కాటేసింది. సిరిప్రణవి(10), ప్రవీణ్(8), ప్రజ్వల్(7)లు నిద్రపోతుండగా ఇంట్లోకి దూరిన పాము చిన్నారులను కాటేసింది. వెంటనే గమనించిన కుటుంబసభ్యులు  పిల్ల‌ల‌ను హుటాహుటిన మొవ్వ పీహెచ్‌సీ ఆసుపత్రికి తరలించారు‌.  

వైద్యులు వెంట‌నే చికిత్స అందించ‌డంతో బాధిత చిన్నారులు కోలుక‌ున్నారు.  చిన్నారులకు ఎలాంటి అపాయం లేదని వైద్యులు చెప్పారు.  కాగా కట్ల పాము అత్యంత విష‌పూరితం అన్న విష‌యం తెలిసిందే.