గుంటూరు: గుంటూరు జిల్లా మాచర్ల కిడ్నా‌పైన చిన్నారి సిద్దూను చంపేశారు. మాచర్ల మార్కెట్ యార్డులోని  క్వారీలో పారేశారు. ఈ నెల 22వ తేదీన  సిద్దూ కిడ్నాప్‌కు గురైన విషయం తెలిసిందే.

గుంటూరు జిల్లా మాచర్లకు చెందిన ఆరేళ్ల  చిన్నారి సిద్దూను ఈ నెల 22వ తేదీన గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. బాధితుడి కుటుంబసభ్యులు ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు.  సిద్దూ కోసం  పోలీసులు ఐదు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు.

సిద్దూను  కిడ్నాపర్  గుంటూరు రైల్వేస్టేషన్‌ నుండి తీసుకెళ్తున్న సీసీ పుటేజీ విజువల్స్‌ను కూడ పోలీసులు గుర్తించారు. ఇంటి బయట ఆడుకొంటున్న సిద్దూను ఎవరు కిడ్నాప్ చేశారు. ఎందుకు హత్య చేశారనే కోణంలో కూడ పోలీసులు ఆరా తీస్తున్నారు.

మాచర్ల మార్కెట్ యార్డుకు సమీపంలోని క్వారీలో సిద్దూ మృతదేహాన్ని స్థానికులు  కనుగొన్నారు.  ఈ విషయాన్ని పోలీసులకు సమాచారాన్ని ఇచ్చారు. మృతదేహన్ని వెలికి తీసిన పోలీసులు అతడిని సిద్దూగా గుర్తించారు. వ్యక్తిగత కక్షతో ఈ దాడికి పాల్పడ్డారా... ఆస్తి తగాదాలా అనే కోణంలో  పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.