Asianet News TeluguAsianet News Telugu

ప్రకాశం జిల్లా రుద్ర సముద్రంలో కారు, బైక్ ఢీ: నలుగురు మృతి


ఉమ్మడి ప్రకాశం జిల్లా దోనకొండ మండలం  రుద్రసముద్రంలో  కారు, బైక్ ఢీకొని  నలుగురు మృతి చెందారు.  అతి వేగంగా భైక్ ను ఢీకొట్టి కారు బోల్తా పడింది. 

Six killed in Road accident  in Prakasham District
Author
First Published Dec 9, 2022, 10:35 AM IST

ఒంగోలు: ఉమ్మడి ప్రకాశం జిల్లా దోనకొండ మండలం  రుద్రసముద్రంలో  శుక్రవారం నాడు ఉదయం కారు. బైక్ ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో  నలుగురు మృతి చెందారు.  ఈ ప్రమాదంలో  బైక్  ను ఢీకొట్టి కారు  బోల్తా పడింది. మృతులది శివరాంపురం గ్రామంగా  పోలీసులు గుర్తించారు.మృతుల్లో ఇద్దరు చిన్నారులున్నారు. అతివేగంగా  కారు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని  ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు.

పెద్దారవీడు శివరాంపురం నుండి దర్శి మండలం పులిపాడు వద్దకు కారులో వెళ్తున్నారు.  ఈ కారు అతివేగంగా వెళ్తూ  ఎదురుగా వస్తున్న బైక్ ను ఢీకొట్టింది.ప్రమాదానికి గురైన బైక్ పై ముగ్గురున్నారు. కారులో  నలుగురున్నారు.  ఈ ప్రమాదంలో బైక్ పై ఉన్న ఇద్దరు, కారులో ఇద్దరు సంఘటన స్థలంలోనే మృతి చెందారు.  ఈ ప్రమాదంలో  మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో  ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసుుల చెబుతున్నారు.

ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పూతలపట్టు మండలంలో ఈ నెల  6వ తేదీన  జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. పెళ్లికి వెళ్తున్న ట్రాక్టర్  అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో ఆరుగురు మృతి చెందారు.మరో 22 మంది గాయపడ్డారు.
ఈ నెల  7న తమిళనాడు చెంగల్పట్టులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. చెంగల్పట్టు జిల్లా మధురాండకం వద్ద జరిగిన ప్రమాదంలో  ఆరుగురు చనిపోయారు.  రెండు వాహనాల మధ్య టాటా ఏస్ వాహనం ఇరుక్కొని  నుజ్జునుజ్జైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బాపట్ల జిల్లా వేమూరు మండలం జంపని వద్ద ఈ నెల 2న జరిగిన రోడ్డు ప్రమాదంలో  నలుగురు మృతి చెందారు. అయ్యప్ప భక్తులు ప్రయాణీస్తున్న టాటా ఏస్ వాహనం బోల్తాపడింది. ఈ ప్రమాదంలో నలుగురు అయ్యప్పభక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.ఇదే వాహనంలో  ఉన్న  మరో  16 మంది గాయపడ్డారు. 

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రత్లాం జిల్లాలో ఈ నెల 5వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. వేగంగా వెళ్తున్న ట్రక్కు టైర్  పేలి అదుపు తప్పి బస్సు కోసం వేచిచూస్తున్న ప్రయాణీకులపై దూసుకెళ్లింది.  ఈ ప్రమాదంలో  ఆరుగురు అక్కడికక్కడే మరణించారు.ఈ ఘటనలో మరో  11 మంది గాయపడ్డారు. 

Follow Us:
Download App:
  • android
  • ios