తాడిపత్రి ఉక్కు ఫ్యాక్టరీలో గ్యాస్ లీకై ఆరుగురి మృతి, ఐదుగురికి అస్వస్థత

six dead in gas leak in Tadipatri steel factory
Highlights

అనంతపురం జిల్లా తాడిపత్రిలో ని ఓ ఉక్కు ఫ్యాక్టరీలో గ్యాస్ లీకై ఆరుగురు చనిపోయారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. అధికారులు సంఘటనస్థలానికి చేరుకొని సహాయక చర్యలను చేపట్టారు.

తాడిపత్రి: అనంతపురం జిల్లా తాడిపత్రిలోని ఓ ఉక్కు ఫ్యాక్టరీలో గురువారం నాడు గ్యాస్ లీకై  ఆరుగురు మృత్యువాత పడ్డారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.  గాయపడినవారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

అనంతపురం జిల్లా తాడిపత్రిలోని ఉక్కు ఫ్యాక్టరీలో ప్రమాదవశాత్తు గ్యాస్ లీకైంది. ఈ ప్రమాదంలో ఆరుగుు అక్కడికక్కడే మరణించారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.  గాయపడిన వారిని చికిత్స నిమిత్తం  ఆసుపత్రికి తరలించారు.

అయితే విషయం తెలిసిన వెంటనే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను చేపట్టారు. విషవాయువులు బయటకు వెళ్లాల్సిన ప్రాంతంలో గ్యాస్  లీకైంది. 15 మంది స్పృహ తప్పిపోయారు. ఈ విషయాన్ని ఎంపీ, ఎమ్మెల్యే సీఎం దృష్టికి తీసుకెళ్లారు. అయితే విషవాయులు ఎలా బయటకు లీకయ్యాయనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు.

loader