తిరుపతి రుయా ఆసుపత్రిలో అంబులెన్స్ మాపియా: ఆరుగురు అంబులెన్స్ డ్రైవర్ల అరెస్ట్
రుయా ఆసుపత్రిలో అంబులెన్స్ మాఫియా ఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకొంది.ఈ విషయమై ఆరుగురు అంబులెన్స్ డ్రైవర్లను పోలీసులు అరెస్ట్ చేశారు.
తిరుపతి: తిరుపతిలోని RUIA ఆసుపత్రిలో బయటి నుండి వచ్చిన అంబులెన్స్ డ్రైవర్ పై దాడికి ప్రయత్నించిన ఘటనపై ఆరుగురు Ambulance డ్రైవర్లను పోలీసులు మంగళవారం నాడు అరెస్ట్ చేశారు.
Annamaiah జిల్లాలోని చిట్వేల్ కు చెందిన ఓ వ్యక్తి తన కొడుకుకు చికిత్స కోసం తీసుకొచ్చాడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పదేళ్ల బాలుడు మరణించాడు. డెడ్ బాడీని స్వగ్రామమైన చిట్వేల్ కి తీసుకెళ్లేందుకు రుయా ఆసుపత్రిలోని అంబులెన్స్ డ్రైవర్లను సంప్రదించాడు. 90 కి,మీ. దూరంలోని చిట్వేల్ కు వెళ్లేందుకు రూ. 20 వేలు డిమాండ్ చేశారు. కొడుకు వైద్యం కోసం డబ్బులు లేకపోవడంతోనే రుయా ఆసుపత్రికి తీసుకొచ్చాడు. అంత డబ్బులు ఇవ్వలేని ఆ వ్యక్తి తనకు తెలిసిన వారికి సమాచారం ఇవ్వడంతో బయటి నుండి అంబులెన్స్ ను రుయా ఆసుపత్రి వద్దకు పంపాడు. అయితే ఈ అంబులెన్స్ ను ఆసుపత్రిలోకి అంబులెన్స్ డ్రైవర్లు రానివ్వలేదు. అంబులెన్స్ డ్రైవర్ ను దూషించడమే కాకుండా కొట్టేందుకు ప్రయత్నించారు. దీంతో అతను అంబులెన్స్ ను తీసుకొని వెళ్లిపోయాడు. ఈ ఘటనపై అంబులెన్స్ యజమాని ఎస్పీకి ఫిర్యాదు చేశాడు.
తన కొడుకు మృతదేహన్ని బైక్ పై 90 కి.మీ దూరంలోని చిట్వేల్ కు తీసుకెళ్లాడు. ఈ ఘటనపై మీడియాలో కథనాలు రావడంతో జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశాలు జారీ చేశారు. ఇవాళ ఉదయమే జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి, ఆర్డీఓ లు ఈ ఘటనపై విచారణ నిర్వహించారు. మరో వైపు డీఎస్పీ రుయా ఆసుపత్రిలో విచారణ నిర్వహించారు.
రుయా ఆసుపత్రిలో RDO విచారణ నిర్వహిస్తున్న సమయంలో TDP, BJP, Janasena కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఆర్డీఓను ఘోరావ్ చేశారు. ఈ ఘటనకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మార్చురీ వాహనం ఏమైందని ప్రశ్నించారు.విపక్ష పార్టీలు ఘెరావ్ చేయడంతో ఒకానొక దశలో ఏం చేయలేని స్థితిలో ఆర్డీఓ సూపరింటెండ్ రూమ్ లోకి వెళ్లి తలుపులు వేసుకొన్నారు. అయితే సూపరింటెండ్ చాంబర్ బయటే విపక్షాలు ఆందోళన చేశాయి.