తాడేపల్లిలో తుళ్లూరు, మందడం గ్రూప్ దేవాలయాల ఈఓ సస్పెండ్ అయ్యాడు. పట్టణ పరిధిలోని సీతానగరంలో గ్రూప్ దేవాలయాల్లో గతంలో ఈఓగా పనిచేసిన సత్యనారాయణ రెడ్డిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. 

ప్రస్తుతం తుళ్లూరు మండలం మందడం గ్రామంలో దేవాలయం ఈఓ గా పనిచేస్తున్న సత్యనారాయణ రెడ్డి గతంలో సీతానగరం గ్రూప్ దేవాలయాల్లో ఈఓ గా పని చేశాడు. ఈ సమయంలో నిధుల దుర్వినియోగంపై పలు ఆరోపణలు వచ్చాయి. 

ఫిక్స్డ్ డిపాజిట్ సొమ్ముని చట్టవిరుద్ధంగా విత్ డ్రా చేసినట్టుగా సత్యనారాయణ రెడ్డిపై ఫిర్యాదులందాయి. వీటిమీద జరిపిన విచారణలో ఆరోపణలు నిర్ధారణ కావడంతో సత్యనారాయణరెడ్డి నీ సస్పెండ్ చేస్తూ దేవాదాయ శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.