అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. బుక్కరాయసముద్రం పాడరాళ్లలో  అక్కపై తమ్ముడు పెట్రోల్ పోసి నిప్పింటించాడు. బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు పరుగు పరుగున వచ్చి మంటలను ఆర్పారు.

అనంతరం ఆమెను ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె శరీరం 70 శాతం వరకు కాలిపోవడంతో ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతోంది. ఉదయం చిన్న విషయంలో గొడవ పడటంతో ఆగ్రహంతో ఊగిపోయిన తమ్ముడు.. అక్కపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు.