కర్నూల్:కర్నూల్ సమీపంలోని తుంగభద్ర నదిలో సింధూజ రెడ్డి మృతదేహం సోమవారం నాడు లభ్యమైంది. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లాకు చెందిన శివకుమార్ రెడ్డి, భార్య సింధూజ రెడ్డి, స్నేహితుడితో కలిసి హైద్రాబాద్‌కు కారులో వెళ్తున్న సమయంలో ప్రమాదం చోటు చేసుకొంది.  గద్వాల్ జిల్లాలోని కలుగొట్ల వాగులో ఈ నెల 25వ తేదీన వాగులో కారు కొట్టుకుపోయింది.

also read:వాగులో కారు గల్లంతు.. 36 గంటలు గడుస్తున్నా దొరకని సింధూజ రెడ్డి ఆచూకీ

ఈ కారు నుండి శివకుమార్ రెడ్డి ఆయన స్నేహితుడు దిగారు. కారు నుండి సింధూజ దిగే సమయంలోపుగానే  కారు వాగులో కొట్టుకుపోయింది. రెండు రోజులుగా కారు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కారు దొరికినా సింధూజరెడ్డి మృతదేహం లభ్యం కాలేదు.

సోమవారం నాడు మధ్యాహ్నం సింధూజ రెడ్డి డెడ్ బాడీ కర్నూల్ కు సమీపంలోని తుంగభద్ర నదిలో లభ్యమైంది.  బెంగుళూరులో నివాసం ఉండే శివకుమార్ రెడ్డి కుటుంబం కారులో హైద్రాబాద్ కు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకొంది. మూడు రోజులుగా సింధూజ రెడ్డి ఫ్యామిలీ మెంబర్లు