సింహాచలంలో భూముల లీజు సహా 12 అంశాలపై సుదీర్ఘంగా దేవస్థానం పాలకమండలి సమావేశం జరిగింది. ఇందులో మొత్తం 12 అంశాలపై సభ్యుల మధ్య ఏకాభిప్రాయం వ్యక్తమైంది.

చైర్‌పర్సన్, ఓఎస్డీ నియామకానికి పాలకమండలి ఆమోదం తెలిపింది. భూములు లీజుకు ఇచ్చే అంశంపై ఇంకా అవగాహన కావాలని ట్రస్ట్ బోర్డు సభ్యులు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలకు లోబడి భూముల లీజును ప్రతిపాదించినట్లు వివరించారు.

తొలగించబడిన 183 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులపై పాలక మండలి సానుకూలంగా స్పందించినట్లు వివరించారు. శనివారం మంత్రి అవంతి శ్రీనివాస్ సింహాచలం వచ్చి నిర్ణయాన్ని ప్రకటిస్తారని ఈవో భ్రమరాంభ తెలిపారు.