నంద్యాలలో టిక్కెట్టు ఆశించి తాను పార్టీలో చేరలేదన్నారు. జగన్మోహన్ రెడ్డే అధిష్టానం కాబట్టి, అధిష్టానం ఎవరిని ఎంపిక  చేసినా తనకు అభ్యంతరం లేదని చెప్పటం గమనార్హం. సమర్ధుడైన నాయకుడు జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో వైసీపీ బాగా పనిచేస్తోందనే టిడిపికి రాజీనామా చేసానన్నారు.  

నంద్యాల నియోజకవర్గంలో అభ్యర్ధిగా ఎవరిని ఫైనల్ చేసినా తనకు అభ్యంతరం లేదంటూ శిల్పా మోహన్ రెడ్డి స్పష్టం చేసారు. బుధవారం వైసీపీలో చేరిన శిల్పా తర్వాత మీడియాతో మాట్లాడుతూ, నంద్యాలలో టిక్కెట్టు ఆశించి తాను పార్టీలో చేరలేదన్నారు. జగన్మోహన్ రెడ్డే అధిష్టానం కాబట్టి, అధిష్టానం ఎవరిని ఎంపిక చేసినా తనకు అభ్యంతరం లేదని చెప్పటం గమనార్హం. సమర్ధుడైన నాయకుడు జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో వైసీపీ బాగా పనిచేస్తోందనే టిడిపికి రాజీనామా చేసానన్నారు.

టిడిపిలో తనను చంద్రబాబునాయుడు పూర్తిగా నిర్లక్ష్యం చేసినట్లు ఆరోపించారు. కొత్తగా మంత్రైన అఖిలప్రియ తమను ఏరోజూ పరిగణలోకి తీసుకోలేదన్నారు. ఇదే విషయాన్ని చంద్రబాబుకు చెప్పినా పట్టించుకోలేదని పేర్కొన్నారు. గౌరవం, మర్యాద లేనిచోట ఉండటం కన్నా ప్రతిపక్షంలో ఉండటమే మేలన్న కారణంతోనే తాను వైసీపీలో చేరినట్లు చెప్పారు. వైసీపీలో చేరటం తన సొంత ఇంటికి వచ్చినట్లైంది.

టిడిపిలో ఉన్నంతకాలం పర్సంటేజీలు, కాంట్రాక్టుల కోసం పాకులాడులేదన్నారు. కేవలం పార్టీ కోసమే పనిచేసిన తనను నిర్లక్ష్యం చేసారంటూ ఆవేధన వ్యక్తం చేసారు. గంగుల కుటంబంతో మొదటినుండి తమకు మంచి సంబంధాలే ఉన్నట్లు తెలిపారు. గౌరవం కాపాడుకోవటం, కార్యకర్తలను కాపాడుకోవటమే తనకు ముఖ్యమన్నారు. టిడిపి నుండి బయటకు వచ్చేసిన కారణంగా తనను వేధింపులకు గురిచేసినా, కేసులు పెట్టినా ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఉప ఎన్నికల్లో వైసీపీ జెండా ఎగరటం ఖాయమని జోస్యం కూడా చెప్పారు శిల్పా మోహన్ రెడ్డి.