గుంటూరు జిల్లాలోని నల్లపాడు పోలీసు స్టేషన్ లో ఎస్ఐగా పని చేస్తున్న వెంకటయ్య లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. ఆయన ఓ వ్యక్తి నుంచి తన ఇంట్లోనే లంచం తీసుకుంటుండగా అధికారులు రైడ్ చేసి పట్టుకున్నారు.
అవినీతిని వ్యతిరేకిస్తూ, నిజాయితీగా విధులు నిర్వహించాల్సిన ఓ పోలీసు అధికారి లంచం కోసం ఆశపడ్డారు. ఓ కేసులో అరెస్టు నుంచి తప్పించాలని కోరుతూ ఆయన దగ్గరికి వెళ్లిన వ్యక్తి నుంచి లంచం డిమాండ్ చేశారు. దీంతో ఆయనను ఏసీపీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
అస్సాంలోని ధుబ్రీలో భూకంపం.. రిక్టర్ స్కేల్ పై 3.1 తీవ్రత నమోదు..
ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసు స్టేషన్ లో కత్తి వెంకటయ్య ఎస్ఐగా పని చేస్తున్నారు. అయితే ఆయన దగ్గరికి ఓ కేసులో నిందితుడు వెళ్లాడని, తనను అరెస్టు నుంచి తప్పించేందుకు సహకరించాలని కోరినట్టు ‘డెక్కన్ క్రానికల్’ నివేదించింది. అయితే దీని కోసం ఎస్ఐ రూ.40 వేలు లంచం డిమాండ్ చేశారు. దీంతో అతడు ఏసీబీకి సమాచారం అందించారు.
ఇంటికి వెళ్లేందుకు ఆటో ఎక్కిన బాలిక.. మద్యం తాగి డైవర్ అత్యాచారం.. కృష్ణా జిల్లాలో ఘటన
దీంతో ఏసీబీ అధికారుల సూచన మేరకు బాధితుడు లంచం ఇచ్చేందుకు శనివారం ఎస్ఐ ఇంటికి వెళ్లాడు. అక్కడ ఎస్ఐ లంచం తీసుకుంటుండగా అధికారులు ఒక్క సారిగా రైడ్ చేసి, రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. దీనిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
