సారాంశం

అస్సాంలోని ధుబ్రీ జిల్లాలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 3.1గా నమోదు అయ్యింది. అయితే దీని వల్ల ఎలాంటి ప్రాణనష్టమూ, ఆస్తి నష్టమూ జరగలేదు.

అస్సాంలో భూకంపం సంభవించింది. ధుబ్రీ జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున 3.1 తీవ్రతతో ఈ భూ ప్రకంపనలు వచ్చాయి. తెల్లవారుజామున 3:01 గంటలకు 17 కిలోమీటర్ల లోతులో దీని భూకంప కేంద్రం ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. ఈ విషయాన్ని ఎన్సీఎస్ తన ఎక్స్ హ్యాండిల్ లో పోస్టు చేసింది. 

కాగా.. గత సోమవారం ఉత్తరాఖండ్ లోని ఉత్తరకాశీ జిల్లాలో సోమవారం 3.0 తీవ్రతతో భూకంపం సంభవించింది 25వ తేదీన భారత కాలమాన ప్రకారం 08.35 గంటలకు ఉత్తరాకాశీలోని భూకంపం వచ్చిందని, దీని తీవ్రత 3.0గా ఉందని ఎన్సీఎస్ పేర్కొంది. 5 కిలో మీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉందని పేర్కొంది. 

సెప్టెంబర్ 11వ తేదీన మణిపూర్‌లోని ఉఖ్రుల్ జిల్లాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.1గా నమోదైంది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) ఈ సమాచారాన్ని ఇచ్చింది. NCS ప్రకారం.. ఉఖ్రుల్ జిల్లాలో సోమవారం రాత్రి 11.01 గంటలకు భూకంపం సంభవించింది. దీని తీవ్రత 5.1 గా నమోదు కాగా.. భూకంపం లోతు 20 కి.మీ.గా నమోదైంది. 

అలాగే.. అదే రోజు తెల్లవారుజామున బంగాళాఖాతంలో 4.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ భూకంపం 70 కిలోమీటర్ల లోతులో నమోదైంది. అయితే, ఈ భూకంపం కార‌ణంగా ఎలాంటి ప్రాణ‌, ఆస్తి న‌ష్టం జ‌ర‌గ‌లేదు. కాగా.. సెప్టెంబర్ లో హిమాచల్ ప్రదేశ్ లోని మండి, చంబా జిల్లాల్లో రిక్టర్ స్కేలుపై 2.8, 2.1 తీవ్రతతో స్వల్ప భూకంపాలు సంభవించాయి.

భూమి లోపల ఏడు పలకలు నిరంతరం తిరుగుతూ ఉండటమే ఈ భూకంపాలకు కారణం. ఈ ప్లేట్లు ఎక్కువగా ఢీకొనే ప్రదేశాలను ఫాల్ట్ లైన్స్ అంటారు. ఇవి తరచుగా ఢీకొంటూ ఉంటాయి. దీని వల్ల ప్లేట్లు విరిగిపోతాయి. వాటి విచ్ఛిన్నం కారణంగా లోపల ఉన్న శక్తి బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో అది ఓ మార్గాన్ని కనుగొంటుంది. దీని వల్ల ఆ ప్రాంతంలో భూమి కంపిస్తుంది. దీనినే భూకంపం అని అంటారు.