విజయవాడ: కృష్ణా జిల్లాలో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. అదుపు తప్పి కారు పంట కాలువలోకి దూసుకెళ్లింది. అవనిగడ్డ - బెజవాడ కరకట్టపై పాప వినాశం వద్ద ఈ ప్రమాదం సంభవించింది. 

ఈ ప్రమాదంలో తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం ఎస్సై వంశీ గల్లంతయ్యారు. కారులో తల్లిని కాపాడిన ఎస్సై బ్యాగ్ కోసం వెళ్లి కాలువలో గల్లంతయ్యారు. ఇటీవలి వర్షాలకు వరద నీరు పెద్ద యెత్తున వస్తోంది. దీంతో కాలువల్లో నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. 

అవనిగడ్డ నుంచి కోడూరుకు వెళ్తున్న సమయంలో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి ఎస్సై ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి పంట కాలువలోకి దూసుకెళ్లింది. ఎస్సై కోసం గాలింపు చర్యలు చేపట్టారు.