Asianet News TeluguAsianet News Telugu

జగన్ సర్కార్ కి నిధుల కొరత: రైతు రుణమాఫీ నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ

4, 5 విడతలకు సంబంధించి రూ.7,959 కోట్లు చెల్లింపును నిలిపివేస్తూ వైసీపీ ప్రభుత్వం విడుదల చేసింది. నిధులు లేకపోవడంతో రుణమాఫీ చేయలేమని ప్రభుత్వం స్పష్టం చేసింది. 

Shortage of funds for ys jagan government: The government stopped the farmer loan waiver
Author
Amaravathi, First Published Sep 25, 2019, 12:31 PM IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతు రుణమాఫీని నిలిపివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఉన్న 4,5 విడతల బకాయిలను నిలిపివేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. 

4, 5 విడతలకు సంబంధించి రూ.7959.12 కోట్లు చెల్లింపును నిలిపివేస్తూ వైసీపీ ప్రభుత్వం విడుదల చేసింది. నిధులు లేకపోవడంతో రుణమాఫీ చేయలేమని ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే గత ప్రభుత్వం మార్చిలో విడుదల చేసిన జీవోను నిలిపివేసింది. తాజాగా జీవో 99 విడుల చేసిన ప్రభుత్వం. 

ఇకపోతే బుధవారం రైతు భరోసా పథకంపై సమీక్ష నిర్వహించారు సీఎం వైయస్ జగన్. అనంతరం వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి పూనం మాలకొండయ్య రుణమాఫీ రద్దు చేస్తూ జీవో 38ను రద్దు చేస్తూ కొత్త జీవోను విడుదల చేశారు. 

అయితే రైతు భరోసా పథకం అమలు చేస్తున్న నేపథ్యంలోనే రైతు రుణమాఫీని రద్దు చేస్తున్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వం విడుదల చేసిన జీవోను రద్దు చేస్తూ రైతు భరోసా పథకం అమలు చేస్తున్నట్లు తెలుపుతూ జీవో 99ని విడదుల చేశారు. 

వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన జీవోపై తెలుగుదేశం పార్టీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. ఇకపోతే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అనేక జీవోలను వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. 

అంతేెకాదు గత ప్రభుత్వంలో జరిగిన కీలక ప్రాజెక్టుల విషయంలోనూ ప్రభుత్వం ఆచితూచిగా వ్యవహరిస్తుంది. ప్రభుత్వ ఖజానాను ఆదా చేసేందుకు రివర్స్ టెండరింగ్ కు వెళ్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్ లో రూ.780 కోట్లు ఆదా చేసిన విషయం తెలిసిందే.

ఈ వార్తలు కూడా చదవండి

టీడీపీని మూసేస్తారా..? లేక రాజకీయ సన్యాసం తీసుకుంటారా..?: చంద్రబాబూకు మంత్రి అనిల్ సవాల్

రివర్స్ టెండరింగ్ ఓ కుట్ర, సన్నిహితుల కోసమే ఆ డ్రామా: మాజీమంత్రి దేవినేని ఉమా

జగన్ ఖాతాలో మరో విజయం: రివర్స్ టెండరింగ్ లో రూ.686 కోట్లు ఆదా

జగన్ రివర్స్ టెండరింగ్ గ్రాండ్ సక్సెస్: తొలి ప్రయత్నంలో రూ.58 కోట్లు ఆదా

రివర్స్ టెండరింగ్ అంటే ఉలుకెందుకు: చంద్రబాబుకు మంత్రి అనిల్ కౌంటర్

గతంలో ఫెయిల్ అయిన మ్యాక్స్ ఇన్ ఫ్రాకు టెండరా...: దేవినేని ఉమా

తక్కువ ఖర్చుతో ప్రాజెక్టుల నిర్మాణం మంచిదే: రివర్స్ టెండరింగ్ సక్సెస్ పై జేసీ

అన్ని ప్రాజెక్టులకు రివర్స్ టెండరింగ్, బాబూ! చిల్లర రాజకీయాలు ఆపు: మంత్రి అనిల్

జగన్ ఏమైనా పతివ్రతా..? నీతిమంతుడిలా మాట్లాడుతున్నాడు: చంద్రబాబు ఫైర్

Follow Us:
Download App:
  • android
  • ios