Asianet News TeluguAsianet News Telugu

మదనపల్లె అక్కాచెల్లెళ్ల హత్య: కాళికనని చెప్పి నాలుక కోసి తినేసిందా..?

తాను పూర్వజన్మలో అర్జునుడినని అలేఖ్య చెప్పేదని పురుషోత్తం వైద్యులకు తెలిపారు.

Shocking things revealed in Madanapalle double murder case
Author
Hyderabad, First Published Jan 30, 2021, 7:31 AM IST

మదనపల్లె అక్కాచెల్లెళ్ల హత్య కేసులో రోజుకో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ నెల 24వ తేదీన తల్లిదండ్రులే తమ ఇద్దరు కూతుళ్లను అతి కిరాతకంగా హత్య చేసిన సంఘటన మనకు తెలిసిందే. కాగా.. ఈ కేసులో తల్లిదండ్రులను అరెస్టు చేసిన పోలీసులు.. వారిని విచారిస్తున్నారు. ఆ విచారణకు తల్లి పద్మజ పెద్దగా సహకరించకపోయినా.. తండ్రి పురుషోత్తం నాయుడు మాత్రం కొన్ని విషయాలు చెబుతున్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలో.. మరో విస్తుపోయే విషయం వెలుగులోకి వచ్చింది.  ‘ తనను తాను కాళికా దేవిగా ఊహించుకొని నా భార్య పద్మజ.. నా పెద్ద కుమార్తె అలేఖ్య(27) ను చంపేసిన తర్వాత ఆమె నాలుక కోసి తినేసింది.’అని చెప్పడం గమనార్హం.

కాగా.. ఈ విషయంలో వారి పోస్టు మార్టం నివేదిక వస్తేనే స్పష్టత వచ్చే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. తాను పూర్వజన్మలో అర్జునుడినని అలేఖ్య చెప్పేదని పురుషోత్తం వైద్యులకు తెలిపారు.

‘ కాలేజీలో పాఠాలు చెప్పడం నీ వృత్తి కాదు.. పాండవుల తరపున అర్జునుడు ముందుండి నడిపిన పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి’ అని అలేఖ్య తనకు చెప్పినట్లు  ఆయన తెలిపారు. ‘ కలియుగం అంతమై.. సత్య యుగం వస్తుందని అలేఖ్య అనేది. కరోనా కూడా ఇందుకు ఒక సూచిక అని చెప్పేది. ఈ మాటలన్నీ నిజమే. నేను చదివిన ఆధ్యాత్మిక పుస్తకాల్లోనూ ఈ విషయాలు ఉన్నాయి’ అని పురుషోత్తం పేర్కొనడం గమనార్హం.

కాగా.. పురుషోత్తం, పద్మజలు ఇద్దరికీ మానసిక వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో జైలు లాంటి వాతావరణంలో చికిత్స అందించాలని.. అందుకే విశాఖలోని ప్రభుత్వ మానసిక చికిత్సా కేంద్రానికి వారిని సిఫారసు చేశామని రుయా మానసిక వైద్య నిపుణులు పేర్కొన్నారు.

కాగా.. రుయా ఆస్పత్రిలోనే పద్మజ చాలా వింతగా ప్రవర్తించడం గమనార్హం. ‘ నాబిడ్డలు తిరిగి వస్తున్నారు. ఇంటికి వెళ్లాలి. జైలులో తోడుగా ఉన్న శివయ్య, కృష్ణయ్య ఇక్కడ కనిపించడం లేదు’ అంటూ ఆమె పేర్కొనడం గమనార్హం.

కాగా.. పద్మజ కుటుంబసభ్యులకు కూడా మానసిక సమస్యలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. పద్మజ తండ్రి 20 సంవత్సరాలుగా మానసిక వ్యాధితో బాధపడుతున్నాడు. వంశపారపర్యంగా ఈ వ్యాధి పద్మజ, ఆమె పెద్ద కుమార్తె అలేఖ్యకు సోకినట్లు వైద్యులు అనుమానిస్తున్నారు. 

ఇదిలా ఉండగా..పద్మజ తమ కుమార్తె అలేఖ్య నాలుక తినేసిందనే విషయంలో నిజం లేదని వైద్యులు క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం.


 

Follow Us:
Download App:
  • android
  • ios