షాకింగ్ ఘటన: చదువుకున్న భార్య ఎక్కడ తనను నిర్లక్ష్యం చేస్తుందోనని చంపేశాడు..
Anakapalle: అనుమానం పెను భూతంలా మారింది. ఓ భర్త తాను కట్టుకున్న భార్యను కడతేర్చాడు. డిగ్రీ వరకు చదువుకున్న భార్య ఇంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఒక ప్రయివేటు వస్త్ర దుకాణంలో పనికి చేరింది. ఈ క్రమంలోనే అవసరమై ఫోన్ కూడా కొనుక్కుంది. తనకు చదువు రాకపోవడం, భార్య ఉద్యోగం చేయడం, ఫోన్ మాట్లాడటం వంటివి చూసిన భర్త అనుమానం పెంచుకుని ఆమె ప్రాణాలు తీశాడు.
Cheedika Village: ఇద్దరు పిల్లలు పుట్టెంత వరకు ఎలాంటి గొడవలు లేకుండా సాగిన కాపురంలో అనుమానపు కత్తిదూసుకువచ్చంది. అనుమానం పెను భూతంలా మారి.. తాను కట్టుకున్న భార్యను కడతేర్చాడు ఓ భర్త. డిగ్రీ వరకు చదువుకున్న భార్య ఇంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఒక ప్రయివేటు వస్త్ర దుకాణంలో పనికి చేరింది. ఈ క్రమంలోనే అవసరమై ఫోన్ కూడా కొనుక్కుంది. తనకు చదువు రాకపోవడం, భార్య ఉద్యోగం చేయడం, ఫోన్ మాట్లాడటం వంటివి చూసిన భర్త అనుమానం పెంచుకుని.. తనను ఎక్కడ నిర్లక్ష్యంతో చేస్తుందోనని ఆమె ప్రాణాలు తీశాడు. ఈ షాకింగ్ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని అనకాపల్లిలో చోటుచేసుకుంది.
వివరాల్లోకెళ్తే.. అనుమానం పెనుభూతమై కట్టుకున్న భార్యను నిర్దాక్షణ్యంగా చంపేశాడు ఓ భర్త. ఈ షాకింగ్ ఘటన నక్కపల్లి మండలం చీడిక గిరిజన గ్రామంలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి స్థానికులు, మృతురాలి బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చీడిక గ్రామానికి చెందిన నాగేంద్రకు మరదలు వరుసయ్యే తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరానికి చెందిన రాజ్యలక్ష్మి(32)తో 2013లో పెళ్లి జరిగింది. ప్రస్తుతం వీరికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఇప్పటివరకు కాపురం బాగానే సాగింది.
అయితే, ఇటీవల ఏమి చదువుకోని నాగేంద్ర పనిపాట లేకుండా గాలికి తిరగడంతో కుటుంబ పరిస్థితులు దారుణంగా మారాయి. తప్పనిపరిస్థితుల మధ్య డిగ్రీ వరకు చదువుకున్న రాజ్యలక్ష్మీ ఇటీవల ఒక వస్త్ర దుకాణంలో పనికి చేరింది. అవసరార్థం ఫోన్ కూడా కొనుక్కుంది. భార్య ఉద్యోగం చేయడం, ఆమె ఫోన్ లో మాట్లాడటంతో భర్త నాగేంద్రలో భార్యపై అనుమానాలు పెరిగాయి. ఇరువురి మధ్య గొడవలు జరగడం మొదలైంది. ఈ క్రమంలోనే రాజ్యలక్ష్మీ ఈ వేధింపులు తట్టుకోలేక తన పుట్టింటికి వెళ్లిపోయింది. పెద్దలు సిర్థిచెప్పి మళ్లీ ఇద్దరినీ కాలిపారు. ఈ క్రమంలోనే భార్యతో ఉద్యోగం మాన్పించాడు.
అయితే, తన కుటుంబ సభ్యులతో ఫోన్ మాట్లాడుతుండగా మరోసారి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఇప్పటికే భార్యపై అనుమానంతో ఉన్న నాగేంద్ర ఆమెపై బలమైన ఆయుధంతో దాడి చేయడంతో.. రక్తపు మడుగులో పడి ప్రాణాలు కోల్పోయింది. ఈ నేరం చేసిన తర్వాత స్వయంగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి నిందితుడు లొంగిపోయాడు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదులో పోలీసులు కేసు నమోదుచేసుకున్నారు. భార్యపై అనుమానంతోనే నాగేంద్ర ఈ హత్యకు పాల్పడ్డాడని ప్రాథమిక విచారణలో వెల్లడైనట్టు పోలీసు అధికారులు తెలిపారు. ఎంతో ప్రేమగా చూసుకునే అమ్మ మరణించడంతో ఇద్దరు ఆడబిడ్డలు అనాథల్లా మారారు.