Asianet News TeluguAsianet News Telugu

షాకింగ్ ఘ‌ట‌న‌: తండ్రి ఆత్మ‌హ‌త్యను మొబైల్ ఫోన్ లో రికార్డు చేసిన నాలుగేళ్ల కొడుకు

Kadapa: తండ్రి ఆత్మ‌హ‌త్య చేసుకుంటుండ‌గా త‌న నాలుగేళ్ల కొడుకు ఆ ఘ‌ట‌న‌ను మొబైల్ ఫోన్ లో రికార్డు చేశాడు. ఈ షాకింగ్ ఘ‌ట‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో చోటుచేసుకుంది. కడప నగరంలోని చిలకలబావి ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున జరిగింది. బాధితురాలి సోదరి టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గురువారం ఈ ఆత్మ‌హ‌త్య‌ వెలుగులోకి వచ్చింది.
 

Shocking incident in AP's Kadapa: Four-year-old son records father's suicide on mobile phone RMA
Author
First Published May 27, 2023, 9:35 AM IST

Four-year-old son films dad’s suicide: తండ్రి ఆత్మ‌హ‌త్య చేసుకుంటుండ‌గా త‌న నాలుగేళ్ల కొడుకు ఆ ఘ‌ట‌న‌ను మొబైల్ ఫోన్ లో రికార్డు చేశాడు. ఈ షాకింగ్ ఘ‌ట‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో చోటుచేసుకుంది. కడప నగరంలోని చిలకలబావి ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున జరిగింది. బాధితురాలి సోదరి టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గురువారం ఈ ఆత్మ‌హ‌త్య‌ వెలుగులోకి వచ్చింది.

ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి స్థానికులు, పోలీసులు తెలిపిన వివ‌రాలు ఇలా ఉన్నాయి..  డిప్రెష‌న్ తో మనస్థాపానికి గురైన ఓ వ్యక్తి తన ఇంటి పైకప్పుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ షాకింగ్ ఘ‌ట‌న‌ను అత‌ని చిన్న కొడుకు మొబైల్ ఫోన్‌లో వీడియో చిత్రించాడు. కడప నగరంలోని చిలకలబావి ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన జరగ్గా, బాధితురాలి సోదరి టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గురువారం వెలుగులోకి వచ్చింది.

బాధితుడు షేక్ జమాల్ వలి (36) టిప్పర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు, అతని భార్య అరిఫున్ కువైట్‌లో ఉద్యోగం చేస్తోంది. దీంతో అతని ముగ్గురు కుమార్తెలు, ఒక కొడుకుతో క‌లిసి నివసిస్తున్నాడు. అతని సోదరి షబానా ప్రకారం, జమాల్ గందరగోళ జీవితాన్ని గడుపుతున్నాడు. ఒక సంవత్సరం క్రితం అతని తండ్రి మదార్ సాహెబ్ మరణం అతనిని నిరాశలోకి నెట్టింది. ఈ క్ర‌మంలోనే డిప్రెష‌న్ కు గుర‌య్యాడు. తన నాలుగేళ్ల కొడుకును వారి ఇంటి పై అంతస్తుకు తీసుకెళ్లి, అతని ఆత్మ‌హ‌త్య‌ను వీడియోగ్రాఫ్ చేయమని కోరాడు. బ‌ల‌వంతంగా త‌న ప్రాణాలు తీసుకున్నాడు. 

శుక్రవారం వీడియో బయటకు రావడంతో విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. కెమెరాను పట్టుకుని వీడియో తీస్తున్న బాలుడు బిగ్గరగా ఏడవ‌డం కూడా అందులో వినిపించింది. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (కడప పట్టణం) Md. షరీఫ్ మాట్లాడుతూ కేసు ద‌ర్యాప్తును ముందుకు తీసుకెళ్లడంలో వీడియో కీలక సాధనంగా మారుతుందని అన్నారు. టూటౌన్ సబ్ ఇన్‌స్పెక్టర్ జయ రాములు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios