పశ్చిమ గోదావరి జిల్లా (west godavari district) నరసాపురం (narasapuram) పర్యటనలో ఓ అభిమాని వల్ల జనసేన (janasena) అధినేత పవన్ కల్యాణ్ (pawan kalyan) తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కారుపైకెక్కి.. అభిమానులను విష్ చేస్తూ వుండగా, ఒక యువకుడు సడెన్‌గా వచ్చి పవన్ కల్యాణ్‌ను కలిసే ప్రయత్నం చేశాడు. ఈ ఘటనతో పవన్ ఒక్కసారిగా వాహనంపై నుంచి పడిపోయారు.
పశ్చిమ గోదావరి జిల్లా (west godavari district) నరసాపురం (narasapuram) పర్యటనలో ఓ అభిమాని వల్ల జనసేన (janasena) అధినేత పవన్ కల్యాణ్ (pawan kalyan) తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మత్స్సకారుల సభకు వెళ్తూ.. మధ్యలో అభిమానులను పలకరించేందుకు ఆగారు పవన్. కారుపైకెక్కి.. అభిమానులను విష్ చేస్తూ వుండగా, ఒక యువకుడు సడెన్‌గా వచ్చి పవన్ కల్యాణ్‌ను కలిసే ప్రయత్నం చేశాడు. ఈ ఘటనతో పవన్ ఒక్కసారిగా వాహనంపై నుంచి పడిపోయారు.
ఇకపోతే.. నరసాపురంలో జరిగే మత్స్యకార మహాసభకు పవన్ కల్యాణ్ హాజరుకానున్నారు. నర్సాపురం ఎంపీ Raghu Rama krishnam Raju ఇటీవలే తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. తనపై అనర్హత వేటు కోసం ప్రయత్నిస్తున్నారని వాళ్లకు తానే సమయం ఇస్తున్నానని వైఎస్సార్‌సీపీ అధిష్టానానికి సవాల్ విసిరారు. ఈ తరుణంలో నరసాపురంలో పవన్ కళ్యాణ్ టూర్ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకొంది.
తనపై అనర్హత వేటు కోసం YCP నేతలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారని కూడా రఘురామకృష్ణంరాజు ప్రకటించారు. తనపై అనర్హత వేటు వేయకపోతే తానే రాజీనామా చేస్తానని కూడా ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే. వారం రోజులు వైసీపీకి సమయం ఇస్తున్నానని కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. తమ పార్టీ వాళ్లు రెండేళ్లగా ఎక్కిన గుమ్మం, దిగిన గుమ్మంతో బిజీగా ఉన్నారు. కుదిరితే స్పెషల్ ఫ్లైట్, కుదరకపోతే అందిన ఫ్లైట్‌లో తిరుగుతూ వరుసగా తనపై ఫిర్యాదులు ఇస్తున్నారని రఘురామకృష్ణంరాజు సెటైర్లు వేశారు. వైసీపీ ప్రయత్నాలు ఫలించకపోయినా తాను రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని రఘురామకృష్ణం రాజు ప్రకటించారు. అంతేకాదు భారీ విజయం సాధిస్తున్నానని ప్రకటించారు.
ఒకవేళ నిజంగా రఘురామ ఎన్నికలకు వెళ్తే ఆయన ఏ పార్టీ నుండి పోటీ చేస్తారనేది కూడా ప్రస్తుతం చర్చ సాగుతుంది.ప్రభుత్వ వ్యతిరేక శక్తులను కూడదీసుకోవాలని ప్రయత్నాలు సాగుతున్నాయి. అయితే రఘురామకృష్ణంరాజు రాజీనామా చేస్తే ఏ పార్టీ ఆయనకు అండగా నిలుస్తోందో కూడా చూడాల్సిందే.
