తమ పదవికి, పార్టీ సభ్యత్వానికి బుధవారం రాజీనామాచేసే యోచనలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. 

వైసీపీ అధినేత జగన్ కి సొంత పార్టీ నేతలే షాకివ్వనున్నారు. పార్టీలో తాము అసంతృప్తిగా లేమంటూ 8మంది నేతలు పార్టీని వీడే ఆలోచనలో ఉన్నారు. నూజివీడు పురపాలకసంఘంలో పాలకపక్షానికి చెందిన వైసీపీ కౌన్సిలర్‌లు ఎనిమిది మంది తమ పదవికి, పార్టీ సభ్యత్వానికి బుధవారం రాజీనామాచేసే యోచనలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. 

గత మూడేళ్లుగా ఈ పాలక వైసీపీలో చైర్మన్‌ పదవిపై వివాదం కొనసాగుతూనే ఉంది. ఇటీవల సమస్య పరిష్కారానికి ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్‌ అప్పారావు కొంత కృషిచేసి అసమ్మతి వర్గమైన రామిశెట్టి మురళీవర్గానికి చెందిన వారికి వైస్‌ చైర్మన్‌ పదవి అందేలా చేశారు. 

అయితే తొలుత ఇచ్చిన హామీమేరకు చైర్మన్‌ పదవి చివరి రెండుసంవత్సరాలు మురళీవర్గానికి ఇవ్వడానికి కుదిరిన ఒప్పందాన్ని అమలుపర్చటంలో జగన్‌తో సహా అందరూ విఫలం కావడంతో మనస్థాపంతోనే ఈ 8 మంది కౌన్సిలర్స్‌ పార్టీకి, పదవికి రాజీనామాలు చేయటానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.