ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి సొంత జిల్లాలోనే భారీ షాక్ తగిలింది.  

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి సొంత జిల్లాలోనే భారీ షాక్ తగిలింది. గడిచిన 40 ఏళ్లుగా పార్టీకి సేవలు అందిస్తున్న సీనియర్ నేత పార్టీని వీడారు. చిత్తూరు జిల్లా తాంబల్లపల్లి నియోజకవర్గం పేటీఎం మండలం ఎంపీపీగా ఉన్న కొండా గీతమ్మ, కొండా సిద్ధార్థ్‌ తమ అనుచరులతో కలిసి తాజాగా వైసీపీలో చేరారు. 

ప్రజాసంకల్పయాత్రలో భాగంగా విజయనగరం జిల్లాలో ఉన్న జగన్ ని కొండా గీతమ్మ, సిద్దార్థ్ లు కలిశారు. మాజీ ఎంపీ మిథున్‌ రెడ్డి, ద్వారాకానాథ్ రెడ్డి ఆధ్వర్యంలో జగన్ వారిని పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా కొండా సిద్ధార్థ్‌ మాట్లాడుతూ.. టీడీపీ వ్యవస్థాకుడు ఎన్టీఆర్‌ పాటించిన విలువలు ప్రస్తుతం టీడీపీలో లేవని అన్నారు. అందుకే 40 ఏళ్లు టీడీపీలో ఉన్నప్పటికీ.. విలువల కోసమే ఆ పార్టీకి రాజీనామా చేసినట్టు వెల్లడించారు. టీడీపీ నిజమైన నేతలకు, కార్యకర్తలకు ప్రస్తుతం విలువ లేదని తెలిపారు.