చిత్తూరు: చిత్తూరు జిల్లాలోని మదనపల్లె మండలం అంగల్లు గ్రామంలో ప్రియురాలి ఇంట్లో ప్రియుడు ఆత్మహత్య చేసుకొన్నాడు.  ఈ ఘటన ఆదివారం నాడు వెలుగు చూసింది. ప్రియురాలి కుటుంబసభ్యులే తమ కొడుకును హత్య చేశారని మృతుడి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

మదనపల్లె మండలంలోని అంగల్లు గ్రామానికి చెందిన శశికుమార్, ఐశ్వర్యలు రెండేళ్లుగా ప్రేమించుకొంటున్నారు. ఈ విషయమై ఈ రెండు కుటుంబాల మధ్య గొడవలు చోటు చేసుకొన్నాయి.  ఈ విషయమై పోలీసులు రెండు కుటుంబాలకు కౌన్సిలింగ్ నిర్వహించారు. అయినా వీరిద్దరూ కూడ ప్రేమ విషయాన్ని మానుకోలేదు.

ఆదివారం నాడు ఐశ్వర్య ఇంట్లో శశికుమార్ ఆత్మహత్య చేసుకొన్నాడు. ప్రియురాలి ఇంట్లో శశికుమార్ ఉరేసుకొని చనిపోయాడు. అయితే ఐశ్వర్య కుటుంబసభ్యులే తన కొడుకును చంపి ఉరేశారని శశికుమార్ కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.ఈ ఘటనపై బాధితుడి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని  దర్యాప్తు చేస్తున్నారు.