Asianet News TeluguAsianet News Telugu

మహిళా వైద్యురాలిపై వేధింపులు... విజయవాడలో కీచక డాక్టర్ అరెస్ట్ (Video)

తోటి మహిళా డాక్టర్ పై లైంగికంగానే కాదు మానసికంగా వేధింపులకు దిగిన కీచక డాక్టర్ కృష్ణ కిశోర్ ను విజయవాడ పోలీసులు అరెస్ట్ చేసారు.

sexual harassment on woman doctor... vijayawada police arrested doctor krihna kishore
Author
Vijayawada, First Published Jan 6, 2022, 2:09 PM IST

విజయవాడ: తోటి మహిళా డాక్టర్ పై వేధింపులకు పాల్పడుతున్న కీచన వైద్యుడు కె. కృష్ణ కిషోర్ ను విజయవాడ (vijayawada) పోలీసులు అరెస్ట్ చేసారు. బాధిత మహిళా డాక్టర్ ఫిర్యాదు మేరకు నిందితుడిపై ఎస్సీ ఎస్టీ తో పాటు 376, 448, 323, 342, 506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పటమట పోలీసులు అరెస్ట్ చేసారు. అనంతరం అతడిని కోర్టుకు తరలించారు. 

వివరాల్లోకి వెళితే... కృష్ణా జిల్లా (krishna district) మైలవరం (mailavaram)లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో కృష్ణకిశోర్ డాక్టర్ గా పనిచేస్తున్నాడు.  ఇదే హాస్పిటల్ లో ఓ మహిళా వైద్యురాలు గతంలో పనిచేసింది. ఈ సమయంలోనే ఆమెపై కృష్ణకిశోర్ వేధింపులకు పాల్పడ్డాడు. తనను పెళ్లి  చేసుకోవాలని అతడు కోరగా తాను తిరస్కరించగా అప్పటినుండి మరింతగా వేధించడం ప్రారంభించాడని బాధిత డాక్టర్ పోలీసుల ఫిర్యాదులో పేర్కొన్నారు. 

Video

ప్రతి రోజూ సమయం సందర్భంగా లేకుండానే  ఫోన్‌లు చేస్తూ ఒంటరి కలవాలని అడిగేవాడని మహిళా డాక్టర్ తెలిపింది. చివరకు ఒక రోజు ఇంటికి వచ్చి బలవంతంగా తాళి కట్టడానికి ప్రయత్నించాడని ఆమె తెలిపారు. తరుచూ ఫోన్‌లో బెదిరింపులకు పాల్పడుతున్నాడని వివరించారు.

read more  కన్నకూతురిపై రెండోసారి తండ్రి అత్యాచారం.. మద్యం మత్తులో కామం తలకెక్కి...

అతడని కాదని మరొకరిని వివాహమాడానని కృష్ణ కిశోర్ మరింతగా శాడిజం ప్రదర్శించడం ప్రారంభించాడని డాక్టర్ ఆందోళన వ్యక్తం చేసారు. చివరకు తన భర్తకు కూడా ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడటమే కాదు బెదిరింపులకు దిగినట్లు బాదిత మహిళా డాక్టర్ ఆవేదన వ్యక్తం చేసారు. 

మహిళా డాక్టర్ ఫిర్యాదుతో పటమట పోలీస్ రంగంలోకి దిగి సదరు కీచక వైద్యుడిని అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు. తోటి డాక్టర్ పట్ల నీచంగా వ్యవహరించిన అతడికి కఠిన శిక్ష పడేలా చూస్తామని పోలీసులు తెలిపారు. మహిళలపై వేధింపులకు పాల్పడేవారిని ఉపేక్షించబోమని పోలీసులు హెచ్చరించారు.

ఇదిలావుంటే తెలంగాణలోనూ ఇటీవల ఓ కీచక డాక్టర్ వేధింపులు బయటపడ్డాయి.  సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ప్రభుత్వ హాస్పిటల్ సూపరింటెండెంట్ నర్సింగ్ చౌహాన్ ఓ అదే హాస్పిటల్ లో పనిచేసే ట్రైనింగ్ నర్సుపై లైంగిక వేధింపులకు దిగి అడ్డంగా బుక్కయ్యాడు. ఇలా నర్స్ పై వేధింపులకు పాల్పడిన చౌహన్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది. అతనిని తాత్కాలికంగా విధుల నుంచి తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

read more  విజయవాడ డెంటల్‌ కాలేజీలో విద్యార్ధినులపై లైంగిక వేధింపులు: ఆరోగ్య శాఖ విచారణ

స్థానిక ప్రభుత్వ హాస్పిటల్ పనిచేసే తనపై సూపరింటెండెంట్ చౌహాన్ వేధింపులకు దిగాడని ట్రైనీ నర్స్ సునీత పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. తనను సూపరింటెండెంట్ ఛాంబర్ కు తీసుకెళ్లి వ్యక్తిగత విషయాలు అడిగాడని.. బావ వరుస అవుతానని చెంపలపై చేతులు వేసి అసభ్యంగా ప్రవర్తించాడని బాధితురాలు పేర్కొంది. 

ఈ విషయాన్ని బాధిత యువతి కుటుంబసభ్యులు, బంధువులకు తెలపడంతో వారు హాస్పిటల్ కు చేరుకుని డాక్టర్ చౌహాన్ పై దాడికి పాల్పడ్డారు. రోడ్డుపైకి ఈడ్చుకువచ్చి అతడిపై దాడి చేయగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. యువతి ఫిర్యాదుతో డాక్టర్ చౌహాన్ పై కేసు నమోదు చేసినట్లు... చట్టపరంగా అతడిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.  


 

Follow Us:
Download App:
  • android
  • ios