విజయవాడ డెంటల్ కాలేజీలో విద్యార్ధినులపై లైంగిక వేధింపులు: ఆరోగ్య శాఖ విచారణ
విజయవాడలోని డెంటల్ కాలేజీలో విద్యార్ధినులపై లైంగిక ఆరోపణలపై వైద్య ఆరోగ్య శాఖ అంతర్గత విచారణ చేస్తోంది. ముగ్గురు వైద్యులతో కూడిన బృందం విచారణ నిర్వహిస్తోంది.
విజయవాడ: బెజవాడలోని dental కాలేజీలో విద్యార్ధినులపై Sexual Harassment ఫిర్యాదుల ఆరోపణలపై వైద్య ఆరోగ్య శాఖ విచారణ చేపట్టింది. ముగ్గురు వైద్యులతో కూడిన బృందం ఆరోపణలు ఎదుర్కొంటున్న వైద్యులపై విచారణ చేస్తోంది. ఇదే వైద్యులపై గతంలో కూడా పలుమార్లు లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చినట్టుగా చెబుతున్నారు.
డెంటల్ కాలేజీలోని ఇద్దరు doctorsపై ఆరుగురు Women Students రాత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. తమపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఇద్దరు వైద్యులపై చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో వైద్య విధ్యార్ధినులు కోరారు. ఈ ఫిర్యాదు మేరకు వైద్య ఆరోగ్య శాఖాధికారులు అంతర్గత విచారణకు ఆదేశించారు.
also read:నందిగామలో దారుణం... మైనర్ బాలికపై అర్ధరాత్రి యువకుడి అత్యాచారయత్నం
బాధిత విద్యార్ధినుల నుండి కూడా వైద్యుల కమిటీ వివరాలను సేకరించింది. ఈ విషయమై విమెన్ ప్రొటెక్షన్ సెల్ కూడా వివరాలను సేకరించింది. మరో వైపు కాలేజీలో పనిచేసే కాంట్రాక్టు మహిళా సిబ్బందికి కూడా లైంగిక వేధింపులు తప్పలేదు.ఈ విషయమై ఫిర్యాదు చేయడానికి మహిళా ఉద్యోగినులు వెనుకంజ వేస్తున్నారు.గతంలో కూడా ఇదే తరహలో వైద్యశాఖలో విద్యార్ధినులపై లైంగిక వేధింపుల ఘటనలు చోటు చేసుకొన్నాయి.
గతంలో నెల్లూరు జీజీహెచ్ సూపరింటెండ్ పై కూడా లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆయను ప్రభుత్వం బదిలీ చేసింది. నెల్లూరు నుండి తిరుపతిలోని రుయా ఆసుపత్రికి బదిలీ చేసింది. వైద్య విద్యార్ధినికి ఫోన్ చేసి ప్రభాకర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఈ విషయమై వైద్య విద్యార్ధినితో ప్రభాకర్ ఫోన్ లో మాట్లాడిన విషయాలు అప్పట్లో సంచలనంగా మారాయి.
నువ్వు నా సోల్‌మేట్.. లైఫ్ పార్ట్‌నర్.. వైజాగ్ కోడలయ్యేదానివి అంటూ మాట్లాడటం ఏమిటి సార్? నా వయస్సు 23 ఏళ్లు.. మీ పిల్లల కంటే కూడా నేను చిన్నదానిని. నాకు ఎందుకు ఫోన్ చేస్తున్నారు?.. రెస్టారెంట్లు, బీచ్‌కు రావాలని అడుగుతారా? నీ రూమ్‌లో ఏసీ లేదుగా.. నా గదికి రా అని ఎలా పిలుస్తారు?.. మీ నంబరును బ్లాక్ చేస్తే.. మరో నంబరు నుంచి ఫోన్ చేస్తున్నారు.. మీ వేధింపుల వల్ల కొన్ని నెలలుగా నేను పుస్తకాలే తెరవలేదు’ అంటూ ప్రభాకర్ తనపట్ల ప్రవర్తించిన తీరును బాధితురాలు బాధతో చెప్పుకొచ్చింది. ఈ విషయమై బాధితురాలి ఫిర్యాదు మేరకు అప్పటి నెల్లూరు ఇంచార్జీ కలెక్టర్ హరేంధిర ప్రసాద్ విచారణకు ఆదేశించారు. ఎస్వీ మెడికల్ కాలేజీలో కూడా లైంగిక వేధింపుల విషయమై పీజీ విద్యార్ధిని అప్పటి గవర్నర్ నరసింహన్ కు ఫిర్యాదు చేసింది. ఈ వేధింపులు తీవ్రం కావడంతో పీజీ విద్యార్ధిని ఆత్మహత్య చేసుకొంది.
పీజీ విద్యార్ధిని శిల్ప ఆత్మహత్య చేసుకోవడానికి లైంగిక వేధింపులే కారణమని ప్రభుత్వం నియమించిన సిట్ కూడా నివేదిక ఇచ్చింది. లైంగిక వేధింపులకు పాల్పడిన ముగ్గురు వైద్యులపై ప్రభుత్వం చర్యలు తీసుకొంది. ఈ ముగ్గురు వైద్యులపై శిల్ప ఫిర్యాదు చేయడానికి ముందే పలు ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే ఆరోపఫలను సీరియస్ గా తీసుకోని విచారణ చేయకపోవడంతో శిల్పపై కూడా నిందితులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.