షాక్: భార్య ఎదుటే కూతురిపై లైంగిక దాడి, సహకరించాలన్న తల్లి

Sexual harassment on step daughter in Kadapa district
Highlights

కడప జిల్లాలో సవతి కూతురిపై తండ్రి అత్యాచారయత్నం

రాయచోటి: తమ ఇంట్లో అద్దెకు ఉంటున్న  వివాహితపై  ఇంటి యజమాని కన్నేశాడు. భర్తకు విడాకులు ఇస్తే తాను వివాహం చేసుకొంటానని నమ్మించాడు. ఇంటి యజమాని  మాటలను నమ్మిన ఆ వివాహిత భర్తకు విడాకులిచ్చి ఇంటి యజమానిని పెళ్ళి చేసుకొంది. కొంతకాలానికి భార్యను వదిలేసి ఆమె కూతురిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.దీంతో బాధితురాలు  పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన కడప జిల్లాలో చోటు చేసుకొంది.

కడప జిల్లా రాయచోటిలో బీరామ్‌సాహెబ్ వీధిలో షఫీవుల్లాఖాన్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. అయితే అతని ఇంట్లో అంగన్ వాడీ వర్కర్‌గా పనిచేస్తున్న ఓ వివాహిత తన భర్త , నలుగురు పిల్లలతో కలిసి అద్దెకు ఉండేది. అయితే పెళ్ళికాని ఇంటి యజమాని ఆ కుటుంబంతో స్నేహంగా ఉండేవాడు. అయితే  వివాహితను  షఫీవుల్లా  మాయమాటలతో లొంగదీసుకొన్నాడు.

భర్తకు విడాకులిస్తే తాను వివాహం చేసుకొంటానని ఆమెను నమ్మించాడు. షపీవుల్లా మాటలను నమ్మిన ఆ వివాహిత భర్తకు విడాకులిచ్చింది.  గత ఏడాది ఆగష్టు 8వ తేదిన వివాహితను  షఫీవుల్లా  వివాహం చేసుకొన్నాడు.  ఆ తర్వాత షఫీవుల్లా నిజ స్వరూపం బట్టబయలైంది. ఇంటర్‌ చదువుతున్న ఆమె కూతురిపై లైంగిక దాడికి యత్నించాడు. మీ అమ్మను వదిలేసి నిన్ను పెళ్లి చేసుకుంటానంటూ వేధించడం మొదలు పెట్టాడు. విధిలేని పరిస్థితిలో బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు.

 మూడు రోజుల క్రితం తల్లి ఎదుటే కూతురిపై లైంగిక దాడికి ప్రయత్నించాడు. ఆమె దుస్తులు చింపేశాడు. లైంగిక దాడికి సహకరించకపోవడంతో ఆమెపై  దాడికి పాల్పడ్డాడు. అయితే షఫీవుల్లాకు సహకరించాలని తల్లి కూడ కోరుతోందని బాధితురాలు చెబుతోంది.  ఈ వేధింపులు తట్టుకోలేక బాధితురాలు  కడప ఎస్పీని ఆశ్రయించింది. ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదు  చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

loader