టీటీడీ విద్యాసంస్థలో లైంగిక వేధింపులు.. ప్రిన్సిపల్, వార్డెన్ సస్పెన్షన్...
ప్రాచ్య కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ సురేందర్ తరచూ hostelకి వెళ్లి విద్యార్థులను లైంగికంగా వేధిస్తున్నట్లు టిటిడి యాజమాన్యానికి ఫిర్యాదులు అందాయి. దేవస్థానం నిఘా విభాగం విచారణలోనూ ఈ విషయం రుజువు కావడంతో బుధవారం ఇద్దరిని సస్పెండ్ చేశారు.
తిరుపతి : తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన Sri Venkateswara Oriental Collegeలో ఇద్దరూ అధ్యాపకులు విద్యార్థినులను Sexual Harassment చేస్తున్నారని ఫిర్యాదులు అందాయి. ఈ అభియోగాలపై కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ సురేందర్, వార్డెన్ రామనాథంను Suspend చేస్తూ ఈవో జవహర్ రెడ్డి ఇచ్చిన ఆదేశాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. దేవస్థానానికి చెందిన మరో కళాశాలలో చదువుకునే తొమ్మిది మంది విద్యార్థులకు ఇక్కడ వసతి కల్పించారు.
ప్రాచ్య కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ సురేందర్ తరచూ hostelకి వెళ్లి విద్యార్థులను లైంగికంగా వేధిస్తున్నట్లు టిటిడి యాజమాన్యానికి ఫిర్యాదులు అందాయి. దేవస్థానం నిఘా విభాగం విచారణలోనూ ఈ విషయం రుజువు కావడంతో బుధవారం ఇద్దరిని సస్పెండ్ చేశారు. విద్యార్థినులు కొందరు వసతి గృహ ఆవరణలో నిషేధిత మాంసాహారాన్ని తిన్నారని.. ఇదే అదనుగా ప్రిన్సిపాల్ తో పాటు.. వార్డెన్ అసభ్యకరంగా ప్రవర్తించినట్లు అభియోగాలున్నాయి.
ఈ వేధింపులు రోజురోజుకూ ఎక్కువవుతుండడంతో ఈ విషయాన్ని బాధిత విద్యార్థులు తల్లిదండ్రులకు తెలిపారు. వారు ఈవో దృష్టికి తీసుకెళ్లడంతో చర్యలు తీసుకున్నారు. నిందితులను అరెస్టు చేయాలని ఐద్వా ఆధ్వర్యంలో శుక్రవారం ఆందోళన నిర్వహించారు.
కాగా, ఇలాంటి దారుణానికి పాల్పడ్డ ఓ వ్యక్తికి శుక్రవారం నల్గొండ కోర్టు జీవితఖైదు విధించింది. నల్గొండ జిల్లా పెద్దాపురం మండలం ఏనమీదితండాలో ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్న వసతిగృహంలో 12 మంది బాలికలపై Rape caseలో రమావత్ హరీశ్ నాయక్ కు Life imprisonment విధిస్తూ మొదటి అదనపు జిల్లా న్యాయస్థానం న్యాయమూర్తి నాగరాజు గురువారం తీర్పు వెలువరించారు. అతనితోపాటు అతనికి సహకరించిన వసతి గృహ నిర్వాహకుడు శ్రీనివాస్ కు జీవిత ఖైదు, అతడి భార్య సరితకు ఆరు నెలల Imprisonment ఖరారు చేశారు.
ప్రాసిక్యూషన్ కథనం మేరకు కేసు వివరాలు ఇలా ఉన్నాయి... గుంటూరు జిల్లా నాగారం మండల కేంద్రానికి చెందిన భార్య భర్తలు నన్నం శ్రీనివాసరావు, సరిత విలేజ్ రీ కన్స్ట్రక్షన్ ఆర్గనైజేషన్ (విఆర్ఓ) అనే ప్రైవేట్ సంస్థను ఏర్పాటు చేసి బాలికల వసతి గృహాన్ని నడుపుతున్నారు. ఈ వసతి గృహంలో బాలికలను చదివించేందుకు ట్యూటర్ గా రమావత్ హరీష్ రోజూ అక్కడికి వచ్చేవాడు. వారికి చదువు చెప్పి భవిష్యత్తులో మంచి పౌరులుగా తీర్చి దిద్దాల్సిన ఆ ట్యూటర్ కు అది కాకుండా వేరే దానిమీద ఆశ కలిగింది.
అతడి కన్ను ఆ చిన్నారుల మీద పడింది. వారిని ఏం చేసినా అడిగేవారు లేరనే ధైర్యం అతడిని దారుణానికి తెగబడేలా చేసింది. దీంతో అక్కడున్న 12 మంది మైనర్లపై మూడు నెలల పాటు అత్యాచారానికి ఒడిగట్టాడు. అంతేకాదు, ఎవరైనా ఎదిరిస్తే చంపేస్తానని బెదిరించేవాడు. అతడికి శ్రీనివాసరావు, సరితలు సహకరించేవారు. దీంతో చిన్నారులు భయపడిపోయేవారు. ఈ విషయం 2014 ఏప్రిల్ 3వ తేదీన బాధిత బాలిక ద్వారా వెలుగులోకి రావడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు,
మిగతా బాలికలపై అత్యాచారం జరిగినట్లు విచారణలో గుర్తించి.. 12 మంది బాలికల ఫిర్యాదు మేరకు 12 కేసులను నమోదు చేశారు. దర్యాప్తు తరువాత నిందితులపై వేర్వేరుగా 12 కేసులలో చార్జిషీట్లు దాఖలు చేశారు. ఆ తరువాత న్యాయస్థాన విచారణలో పది కేసులలో నేర నిర్ధారణ కావడంతో హరీష్, శ్రీనివాసరావులకు జీవితఖైదు.. పది వేల రూపాయల చొప్పున జరిమానా విధించారు. బెదిరింపులకు పాల్పడినందుకు హరీష్ కు మరో రెండేళ్లు, అసభ్యకరంగా ప్రవర్తించినందుకు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు.