ఏలూరు పాత బస్టాండ్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. పాత బస్టాండ్‌లోని ఒకటో నెంబర్ ప్లాట్‌ఫామ్ వద్ద శ్లాబ్ కూలింది.
ఏలూరు పాత బస్టాండ్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. పాత బస్టాండ్‌లోని ఒకటో నెంబర్ ప్లాట్‌ఫామ్ వద్ద శ్లాబ్ కూలింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. దీంతో వారిని వెంటనే ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ పరిణామంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని.. గాయపడిన ప్రయాణికులను 108 వాహనంలో వైద్యం కోసం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే పాత బస్టాండు భవనం శిథిలావస్థకు చేరడంతో ఈ ఘటన చోటుచేసుకుందని చెబుతున్నారు. బస్టాండ్‌లో పరిస్థితులపై అధికారులకు ఫిర్యాదు చేసిన స్పందించకపోవడంతోనే ఈ ప్రమాదం చోటుచేసుకుందని అంటున్నారు.
