అమరావతి: మూడు రోజుల క్రితం నార్కట్‌పల్లి ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై దాడికి పాల్పడిన నిందితులపై పలు కేసులు ఉన్నట్టుగా  విజయవాడ పోలీసులు గుర్తించారు.

శనివారం అర్ధరాత్రి విజయవాడలోని భవానీపురం ప్రాంతంలో కొందరు యువకులు విజయవాడ నుండి హైద్రాబాద్‌కు వెళ్తున్న నార్క‌ట్‌పల్లి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై దాడికి దిగారు. బస్సు కండక్టర్‌ నుండి రూ,. 25 వేలు దోచుకొన్నారు.

ఈ దాడి జరుగుతున్న సమయంలో ప్రయాణీకులు తమ సెల్‌ఫోన్‌లో రికార్డు చేశారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ దృశ్యాల ఆధారంగా పోలీసులు  నలుగురు యువకులను పోలీసులు ఆదివారం నాడు అరెస్ట్ చేశారు.

అయితే ఈ నలుగురిలో షేక్  సాజిద్,  దుర్గా రాజేష్‌లపై దోపీడీ కేసులున్నాయి. సురేంద్ర కుమార్,రాజేష్‌లపై దోపీడీ కేసులు ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. క్షణికావేశంలో ఈ దాడి చేసినట్టుగా తొలుత భావించారు. కానీ, నిందితులు ఉద్దేశ్యపూర్వకంగానే దాడి చేశారని విచారణలో పోలీసులు గుర్తించారు.

దుర్గా రాజేష్, షేక్ సాజిద్‌లపై దారి దోపీడీ కేసులు ఉన్నాయి. వీరిద్దరిపై పెనమలూరు, కృష్ణలంక పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నాయి. రాజేష్ అనే వ్యక్తిపై బైక్ దొంగతనం కేసు ఉంది.సురేంద్ర కుమార్ పై పేకాట కేసు నమోదయ్యాయి.

 

సంబంధిత వార్తలు

సైడ్ ఇవ్వలేదని ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ను చితకబాదిన అల్లరిమూకలు