2017: చంద్రబాబు 7 ప్రధాన వైఫల్యాలేంటో తెలుసా ?

First Published 27, Dec 2017, 6:32 PM IST
Seven setbacks of Naidu in 2017
Highlights
  • తన జబ్బలు తానే చరుచుకునే చంద్రబాబునాయుడును కొన్ని వైఫల్యాలు వెంటాడుతున్నాయి.

ఇండస్ట్రీలో 40ఏళ్ళ అనుభవం అని తన జబ్బలు తానే చరుచుకునే చంద్రబాబునాయుడును కొన్ని వైఫల్యాలు వెంటాడుతున్నాయి. నిజానికి తన అనుభవాన్ని రాష్ట్రాభివృద్ధికి ఉపయోగించాల్సింది పొయి ప్రతిపక్షాన్ని దెబ్బకొట్టటానికి ఉపయోగిస్తుండమే అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

 

  1. ఫిరాయింపులతో అపఖ్యాతి: 2014లో అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ప్రధానప్రతిపక్షం వైసిపిని దెబ్బకొట్టటం ఎలాగ అన్న విషయంపైనే పూర్తి సమయాన్ని వెచ్చిస్తున్నారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని దెబ్బకొట్టేందుకు చివరకు ఫిరాయింపులను సైతం ప్రోత్సహించి జాతీయ స్ధాయిలో అపఖ్యాతిని మూటకట్టుకుంటున్నారు.

2-గ్రాఫిక్స్ లో ముంచెత్తుతున్నారు: రాజధాని నిర్మాణం తన వల్లే అవుతుందని, పోలవరం తానైతేనే కట్టగలనంటూ పోయిన ఎన్నికల్లో గొంతు చించుకుని ప్రచారం చేసారు. అయితే, అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్ళవుతున్నా పోలవరం, రాజధాని నిర్మాణం సంగతి ఏమైందో అందరూ చూస్తున్నదే. రాజధానిని గ్రాఫిక్స్ లో చూపిస్తున్న చంద్రబాబు, పోలవరం నిర్మాణంలో చేతులెత్తేసారు.

3-ప్రత్యేకహోదా సాధనలో విఫలం: పోయిన ఎన్నికల్లో ప్రత్యేకహోదా సాధన కీలకమైన హామీ. అయితే, వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాష్ట్రప్రయోజనాలను సైతం పణంగా పెట్టటంతో జనాలు మండిపోతున్నారు. కేంద్రంలో అధికారంలో  ఉన్నది మిత్రపక్షమే అయినప్పటికీ రాష్ట్రప్రయోజనాలను కాపాడటంలో విఫలమయ్యారనే చెప్పాలి.

4-ఓటుకునోటు: చంద్రబాబుపై గతంలో ఉన్న కేసులు అన్నీ ఒక్కటి,  ఓటుకునోటు కేసు ఒక్కటి. ఈ కేసులో అరెస్టుకు భయపడే పదేళ్ళ ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ను అర్ధాంతరంగా వదిలి పెట్టేసి విజయవాడకు మకాం మార్చేసారు. దాంతో విభజన హామీలపై ఏపికున్న అధికారాలను చంద్రబాబు వల్లే రాష్ట్రం కోల్పోతోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయ్.

5-కోల్పోతున్న పట్టు: వయస్సు ప్రభావమో ఏమో తెలీదు కానీ ప్రభుత్వం, పార్టీపై చంద్రబాబు పట్టు కోల్పోతున్న విషయం స్పష్టంగా తెలుస్తోంది. చాలామంది అధికారులు చంద్రబాబు మాటను పెద్దగా లెక్క పెట్టటం లేదు. ఇక, పార్టీలో కూడా ప్రతీ జిల్లాలోనూ గ్రూపు తగాదాలు బాగా పెరిగిపోయాయి. ఏ ఇద్దరు నేతలను అదుపులో పెట్టలేకపోతున్నది స్పష్టం.

6-ప్రధానే దూరం పెట్టేసారు: ఒకపుడు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పానని చెప్పుకునే  చంద్రబాబును ప్రధానమంత్రి నరేంద్రమోడి పూర్తిగా దూరం పెట్టేసారు. గడచిన ఏడాదిన్నరగా ప్రధానమంత్రి అపాయిట్మెంట్ ను చంద్రబాబు సాధించలేకపోతున్నారంటేనే పరిస్ధితి అర్ధమవుతోంది.

7-జనాల్లో పెరిగిపోతున్న వ్యతిరేకత: విభజన హామీల అమలులో విఫలం. ఎన్నికల హామీల అమలులో విఫలం. దాంతో జనాల్లో చంద్రబాబు పాలనపై బాగా వ్యతిరేకత పెరిగిపోతోంది. ఓ నంద్యాల ఉపఎన్నికలో, కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలో గెలిచారంటే అది టిడిపి అధికారంలో ఉండటం వల్ల అన్నీ వ్యవస్ధలను మ్యానేజ్ చేయటం వల్లే సాధ్యమైంది.

 

 

loader