Asianet News TeluguAsianet News Telugu

వ్యాపార లావాదేవీలే కరణం రాహుల్ హత్యకు కారణం: విజయవాడ సీపీ బత్తిన శ్రీనివాసులు

విజయవాడలో జిక్సిన్ సిలిండర్ల ఫ్యాక్టరీ యజమాని కరణం రాహుల్  హత్య కేసుకు  వ్యాపార లావాదేవీలే కారణమని పోలీసులు చెప్పారు.   సెల్ ఫోన్  ఛార్జింగ్  వైర్‌తోనే ఆయన కారులోనే  రాహుల్ ను హత్య  చేశారని విజయవాడ సీపీ బత్తిన శ్రీనివాసులు చెప్పారు.

Seven arrested in karanam Rahul  murder case says Vijayawada CP Srinivasulu
Author
Vijayawada, First Published Aug 27, 2021, 4:33 PM IST


విజయవాడ: వ్యాపార లావాదేవీలే జిక్సిన్ సిలిండర్ల వ్యాపారి కరణం రాహుల్ హత్యకు కారణమని విజయవాడ సీపీ బత్తిన శ్రీనివాసులు చెప్పారు. జిక్సిన్ సిలిండర్ల ఫ్యాక్టరీ ఎండీ కరణం రాహుల్ హత్య కేసులో  ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసినట్టుగా ఆయన తెలిపారు. శుక్రవారం నాడు ఆయన విజయవాడలో తన కార్యాలయంలో  మీడియాతో మాట్లాడారు.   కారులో డ్రైవింగ్ సీట్లో కూర్చొన్న రాహుల్ ను వెనుక నుండి సెల్‌ఫోన్ ఛార్జింగ్ వైర్ తో చంపారని  సీపీ చెప్పారు.  ఈ కేసులో ఇప్పటివరకు ఏడుగురిని అరెస్ట్ చేసినట్టుగా సీపీ తెలిపారు.

ఫ్యాక్టరీ విషయమై కోరాడ విజయ్ కుమార్ తో రాహుల్ కు వబేధాలొచ్చాయని సీపీ శ్రీనివాసులు తెలిపారు.  రాహుల్ హత్య కేసులో మొత్తం 13 మంది ఉన్నారని సీపీ తెలిపారు. అయితే ఇప్పటివరకు ఏడుగురిని అరెస్ట్ చేసినట్టుగా తెలిపారు. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు. ఈ కేసులో ఇంకా కొందరి అనుమానితుల ప్రమేయంపై కూడా విచారణ చేస్తున్నామన్నారు. 

పార్మింగ్ చేసిన ప్రాంతంలోనే కారులోనే రాహుల్ ను నిందితులు హత్య చేశారని సీపీ చెప్పారు.  రాహుల్ ను కోగంటి సత్యం, కోరాడ విజయ్ కుమార్ లు బెదిరించారని  తమ దర్యాప్తులో తేలిందని సీపీ వివరించారు.  రాహుల్ ను బెదిరించి  కొన్ని డాక్యమెంట్లపై కూడా సంతకాలు తీసుకొన్నారని సీపీ చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios