మైనర్ బాలికలే టార్గెట్ గా అత్యాచారాలు... విశాఖలో సీరియల్ రేపిస్ట్ అరెస్ట్ (వీడియో)
గతేడాది ఓ చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడి జైలుకెళ్లిన యువకుడు బెయిల్ పై బయటకు వచ్చి మరో చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ అమానుషం విశాఖ నగరంలో చోటుచేసుకుంది.
విశాఖపట్నం : అభం శుభం తెలియని చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన నీచున్ని విశాఖపట్నం పోలీసులు అరెస్ట్ చేసారు. ఈ నెల(ఏప్రిల్) 9న నగరంలోని ముడసర్లోవ పార్కులో చిన్నారిపై ఓ యువకుడు అఘాయిత్యానికి పాల్పడి పరారయ్యాడు.బాధిత బాలిక చెప్పిన వివరాలతో పాటు సాకేంతిక ఆధారాలతో ఈ అఘాయిత్యానికి పాల్పడింది గొండెల సాయి అనే యువకుడని గుర్తించిన పోలీసులు అరెస్ట్ చేసారు.
చిన్నారి అత్యాచార ఘటనకు సంబంధించిన వివరాలకు విశాఖ పోలీస్ కమీషనర్ త్రివిక్రమ్ వర్మ వెల్లడించారు. ఈ నెల 9న (ఆదివారం) బాధిత బాలిక ఒంటరిగా కనిపించడంతో మాయమాటలతో ఆమెను ముడసర్లోవ పార్కుకు తీసుకెళ్లాడు సాయి. అక్కడ బాలికపై అత్యాచారానికి పాల్పడి పరారయ్యాడు. బాలిక కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
చిన్నారి తెలిపిన వివరాలు, పార్క్ చుట్టుపక్కల సిసి కెమెరాలు, సాంకేతికత ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితున్ని గుర్తించారు. పాత నేరస్తుడు సాయి ఈ పని చేసాడని నిర్దారించుకుని అరెస్ట్ చేసారు. అతడిపై ఫోక్సోతో పాటు మరికొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు విశాఖ సిపి తెలిపారు.
వీడియో
నిందితుడు సాయి ఉన్నత విద్యావంతుడని... మైక్రో బయాలజి చదివాడని సిపి త్రివిక్రమ వర్మ తెలిపారు. నగరంలోని రామా టీకీస్ ప్రాంతంలో నివాసముంటూ బీచ్ రోడ్డులోని అపార్ట్ మెంట్ లో వాచ్ మెన్ పనిచేస్తున్నాడని తెలిపారు.
Read More మైనర్ బాలికపై సొంత మేనమామ హత్యాచారం... అదృశ్యమై ముళ్లపొదల్లో శవంగా..
గతేడాది అక్టోబర్ లో ఇలాగే 10ఏళ్ల బాలికపై నిందితుడు సాయి అత్యాచారానికి పాల్పడి జైలుకు వెళ్ళినట్లు సిపి తెలిపారు. ఆరిలోవలో అతడిపై ఫోక్సో కేసు నమోదయ్యిందని... రెండున్నర నెలలు జైళ్లో వుండి కండిషన్ బెయిల్ పై బయటకు వచ్చాడన్నారు. జైలు జీవితం గడిపికూడా సాయిలో ఎలాంటి మార్పు రాలేదని... మరో చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడి పట్టుబడ్డాడని త్రివిక్రమ వర్మ వెల్లడించారు.
కేవలం అత్యాచారం కేసులే కాదు మరికొన్ని ఇతర కేసులు కూడా సాయిపై వున్నట్లు సిపి తెలిపారు. ఇతడిపై ఏయే పోలీస్ స్టేషన్లలో ఏ కేసులు వున్నాయో తెలుసుకుంటున్నామని... పూర్తి వివరాలను సేకరించాక వెల్లడిస్తామని విశాఖ సిపి త్రివిక్రమ వర్మ తెలిపారు.