కడప: కరోనా సోకిందనే భయంతో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు సిరిగిరెడ్డి గంగిరెడ్డి మంగళవారంనాడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 

ఎర్రగుంట్ల మండలం సున్నపురాళ్లపల్లి వద్ద ఈ ఘటన చోటు చేసుకొంది. కరోనా సోకడంతో గంగిరెడ్డి ప్రొద్దుటూరులోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. 
రెండు రోజుల క్రితం గంగిరెడ్డి ఎవరికి చెప్పకుండానే  ఎర్రగుంట్ల మండలం సున్నపురాళ్లపల్లె వద్ద రైల్వే ట్రాక్ పై ఆత్మహత్యకు పాల్పడ్డారు. 

ఎర్రగుంట్ల మండలం సున్నపురాళ్ళపల్లె దగ్గర రైల్వే ట్రాక్‌పై శవమై కనిపించాడు. ఆయన రైలు కింద పడి ప్రాణాలు తీసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. కరోనా భయంతోనే గంగిరెడ్డి ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.  

కరోనా సోకిన వారిలో ఎక్కువ మంది కోలుకొంటున్నారు. దేశంలో కరోనా సోకినవారిలో సుమారు 74 శాతానికి పైగా కోలుకొంటున్నారని నివేదికలు చెబుతున్నాయి. కరోనా సోకిన వారిలో మరణాలు సంఖ్యను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం తెలుపుతోంది.

ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో సోమవారం నాటికి కరోనా కేసులు 3 లక్షల 58 వేల 817కి చేరుకొన్నాయి. రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లాల్లో అత్యధికంగా కరోనా కేసులు నమోదయ్యాయి.సోమవారం నాడు ఒక్క రోజే 8601 కేసులు రికార్డయ్యాయి.