‘ఓడలు బండ్లు..బండ్లు ఓడలు అవుతాయి’ అన్న సామెతను అందరూ వినేఉంటారు. అటువంటి సామెత సరిగ్గా బిజెపి కురువృద్ధుడు లాల్ క్రిష్ణ అద్వానీ-ప్రధానమంత్రి నరేంద్రమోడికి సరిగ్గా సరిపోతుంది. మొన్న త్రిపురలో బిజెపి తరపున ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం విప్లవ్ కుమార్ చేశారు. ఆ సందర్భంగా ప్రధానమంత్రి మోడి, జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తో పాటు పలువురు అతిరధ మహారథలు హజరయ్యారు.

మాజీ సిఎం మాణిక్ సర్కార్ కూడా కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వచ్చిన వారిలో మోడి అందరికీ నమస్కారాలు పెట్టారు. అయితే, అద్వానీ వద్దకు వచ్చే సరికి కనీసం పలుకరించను కూడా లేదు. అద్వానీ నమస్కారం పెట్టినా పట్టించుకోలేదు. వీడియోను చూస్తే మీకే అర్ధమవుతుంది మోడి వైఖరేంటో.