ఏపీ సీఎస్ ఆధిత్యనాథ్ దాస్‌కు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ లేఖ రాశారు. స్ధానిక సంస్థల ఎన్నికలపై విజయసాయి వ్యాఖ్యలపై ప్రస్తావించారు. అధికార పార్టీలో సీనియర్ నేతలంటూ లేఖలో ప్రస్తావించారు.

తిరుపతి ఉప ఎన్నికల తర్వాత ఏప్రిల్, మే లో స్థానిక ఎన్నికలు ఉంటాయని... అధికార పార్టీలో ఓ సీనియర్ నేత చెప్పారని నిమ్మగడ్డ వెల్లడించారు. తన హయాంలో స్థానిక ఎన్నికలు నిర్వహించకూడదని.. ప్రభుత్వం, అధికార పార్టీ ఓ నిర్ణయానికి వచ్చాయనే విషయం స్పష్టమవుతోందని రమేశ్ కుమార్ ఆరోపించారు.

న్యాయపరమైన ఇబ్బందులున్నాయని కామెంట్లు చేశారని.. దీనికి అనుగుణంగానే ఎన్నికలు వాయిదా వేయాలని కోరారని నిమ్మగడ్డ వ్యాఖ్యానించారు. వాయిదా వేయమనడం రాజకీయ నిర్ణయమని నిరూపణ అయ్యిందన్నారు.

Also Read:ఇప్పట్లో స్థానిక ఎన్నికలు కష్టమే: నిమ్మగడ్డకు తేల్చిచెప్పిన సీఎస్

అయితే ఆ వెంటనే నిమ్మగడ్డ లేఖకు సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ప్రత్యుత్తరం ఇచ్చారు. ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు సముఖంగా లేదని.. నిమ్మగడ్డ రాయటాన్ని సీఎస్ తప్పుబట్టారు.

ఎన్నికల ప్రక్రియను నిలిపింది ఈసీ అని లేఖలో ప్రస్తావించారు సీఎస్. ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని ఎస్ఈసీ దృష్టికి తీసుకొచ్చామని ఆదిత్యనాథ్ తెలిపారు.

కరోనా వ్యాక్సినేషన్‌ను సవ్యంగా పూర్తి చేయటానికి సహకరించాల్సిందగా లేఖలో కోరారు సీఎస్. వ్యాక్సినేషన్ పూర్తయ్యాకే ఎన్నికల నిర్వహణ అన్నారు ఆదిత్యనాథ్ దాస్. తమ అభ్యర్ధనను పరిగణనలోకి తీసుకోవాలని లేఖలో విజ్ఞప్తి చేశారు.