ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో  సాధ్యం కాదని తేల్చి చెప్పారు ఏపీ ప్రభుత్వ  ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌తో ఆయన శుక్రవారం భేటీ అయ్యారు.

ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కరోనా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమంలో తలమునకలై వుందని, కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా పోలింగ్ తరహాలోనే జరపాలన్న కేంద్రం గైడ్ లైన్స్‌ ఇచ్చినట్లు వివరించారు.

ఏపీలో కరోనా వ్యాక్సిన్ డ్రై రన్ కార్యక్రమాన్ని దఫ దఫాలుగా చేపట్టామని ఎస్ఈసీ దృష్టికి తీసుకెళ్లారు అధికారులు. కరోనా వ్యాక్సిన్ పంపిణీ విషయంలో ప్రభుత్వ చర్యలను ఎస్ఈసీకి వివరించిన ఉన్నతాధికారులు నివేదికను పంపేందుకు సిద్ధమయ్యారు.