అమరావతి: రాజకీయ పార్టీలతో రాష్ట్ర ఎన్నికల సంఘం సమావేశాన్ని నిలిపివేయాలని దాఖలైన లంచ్ మోషన్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు బుదవారం నాడు నిరాకరించింది.

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు గాను రాజకీయ పార్టీలతో ఎన్నికల సంఘం సమావేశాన్ని రద్దు చేయాలని నవతరం పార్టీ అధ్యక్షుడు సుబ్రమణ్యం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశాడు.

అయితే ఈ పిటిషన్ ను ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం నిరాకరించింది. ఏపీ రాష్ట్రంలో  స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో రాజకీయ పార్టీలతో బుధవారం నాడు రాష్ట్ర ఎన్నికల సంఘం సమావేశాన్ని నిర్వహించింది. 

also read:లైవ్ అప్ డేట్స్: స్థానిక పోరుపై నిమ్మగడ్డ భేటీ, ఎన్నికలకు సిద్దమన్న టీడీపీ

అయితే ఈ సమావేశానికి వైసీపీ దూరంగా ఉంది. ఈ సమావేశానికి హాజరుకాకున్నా జనసేన తన అభిప్రాయాన్ని ఈ మెయిల్ ద్వారా రాష్ట్ర ఎన్నికల సంఘానికి తెలిపింది. మెజారిటీ పార్టీ నేతలు గత ఎన్నికలను రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశాయి.

టీడీపీ ఎన్నికలకు సిద్దమని ప్రకటించింది. అయితే గతంలో జరిగిన ఎన్నికలను రద్దు చేయాలని టీడీపీ డిమాండ్ చేసింది. కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని సీపీఐ, బీజేపీ, బీఎస్పీలు కోరాయి. ఎన్నికలు నిర్వహించాలని సీపీఎం కోరింది.