ఆగస్ట్ 16నుండి రాష్ట్రంలో స్కూల్ రీఓపెన్: ఏపి విద్యాశాఖ మంత్రి కీలక ప్రకటన

ఈనెల(జులై) 12 నుంచి ఆన్ లైన్ తరగతులు ప్రారంభించి ఆగస్ట్ 16నుండి పాఠశాలలను పున:ప్రారంభించాలని  సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నట్లు విద్యా మంత్రి వెల్లడించారు. 

schools reopen in andhra pradesh from august 16th akp

అమరావతి: ఆగస్టు 16 నుంచి పాఠశాలలు పునః ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆంధ్ర ప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. అలాగే ఈనెల(జులై) 12 నుంచి ఆన్ లైన్ తరగతులు ప్రారంభించాలని సీఎం జగన్ తో జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు విద్యా మంత్రి వెల్లడించారు. 

విద్యాశాఖలో నాడు- నేడు పై బుధవారం సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత మంత్రి సురేష్ మాట్లాడుతూ... ఆగస్ట్ లో స్కూల్స్ తిరిగి ప్రారంభంకానున్న నేపథ్యంలో అప్పట్లోపు విద్యాసంస్థల్లో నాడు నేడు పెండింగ్ పనులు పూర్తి చేయాలని సీఎం ఆదేశించినట్లు తెలిపారు. జూల్ 15 నుండి ఆగస్టు 15వరకు వర్క్ బుక్కులపై ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. 

read more  థర్డ్‌వేవ్ వస్తుందో రాదో తెలియదు.. కానీ మేం సిద్ధం: జగన్ వ్యాఖ్యలు

''పాఠశాలలు పునఃప్రారంభం కానున్న ఆగస్టు15లోపు పాఠశాల పనులు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. పాఠశాలల్లో నాణ్య మైన విద్య అందించడమే లక్ష్యంగా సీఎం చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం నూతన విద్యా విధానాన్ని తప్పనిసరిగా అమలు చేస్తుంది. ఈ నూతన విద్యా విధానం అమలు వల్ల ఏ స్కూల్ మూతపడదు, ఏ ఉపాద్యాయుడు పోస్టు తగ్గదు'' అని సురేష్ స్పష్టం చేశారు. 

''రాబోయే రెండేళ్లలో ఫౌండేషన్ స్కూళ్లకు అదనపు గదులు నిర్మాణం పూర్తిచేస్తాం. నాడు నేడు కింద పనుల కోసం రూ.16 వేల కోట్లతో బడ్జెట్ సిద్దం చేయాలని సీఎం ఆదేశించారు. 30శాతం పదో తరగతి , 70 శాతం ఇంటర్ ప్రధమ సంవత్సరం మార్కులు ప్రాతిపదికగా ఇంటర్ విద్యార్థులకు మార్కుల కేటాయిస్తాం. ఈ నెలాఖరులోపు ఇంటర్ విద్యార్థులకు మార్కుల మెమోలు జారీ చేస్తాం''

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios