థర్డ్‌వేవ్ వస్తుందో రాదో తెలియదు.. కానీ మేం సిద్ధం: జగన్ వ్యాఖ్యలు
థర్డ్ వేవ్ వస్తుందో రాదో మనకు తెలియదన్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్. మంగళవారం తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో ఆయన అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. పదిసార్లు ఇంటింటికీ ఫీవర్ సర్వే చేశామని సీఎం తెలిపారు.
థర్డ్ వేవ్ వస్తుందో రాదో మనకు తెలియదన్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్. మంగళవారం తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో ఆయన అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. పదిసార్లు ఇంటింటికీ ఫీవర్ సర్వే చేశామని సీఎం తెలిపారు. దేవుడి దయ వల్ల కోవిడ్ తగ్గుముఖం పడుతోందన్నారు. సెకండ్ డోస్‌కు ప్రాధాన్యం ఇస్తామని జగన్ చెప్పారు. దిశ యాప్ డౌన్‌లోడ్‌పై పోలీసులు దృష్టి పెట్టాలని సీఎం కోరారు. కరోనా కట్టడికి ప్రభుత్వ యంత్రాంగం ఎంతో శ్రమించిందని జగన్ ప్రశంసించారు. అందరి కృషితోనే కోవిడ్‌ను అరికట్టగలిగామని ఆయన అన్నారు.
థర్డ్ వేవ్ వస్తే ఎదుర్కొనేందుకు సిద్ధంగా వున్నామని సీఎం పేర్కొన్నారు. థర్డ్ వేవ్ ఎదుర్కొనేందుకు కార్యాచరణ సిద్ధమని ఆయన స్పష్టం చేశారు. 104 ద్వారా నిరంతరాయంగా సేవలు అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. వ్యాక్సినేషన్ వందశాతం పూర్తయ్యే వరకు అప్రమత్తంగా వుండాలని.. ప్రతిరోజూ గ్రామాలకు ఎమ్మెల్యేలు, అధికారులు, వార్డు మెంబర్లు వెళ్లే కార్యక్రమం మొదలవుతుందన్నారు.
Also Read:ఏపీల్లో కొత్తగా 3,042 మందికి పాజిటివ్: కేసుల్లో తూర్పుగోదావరి, మరణాల్లో చిత్తూరు టాప్
కర్ఫ్యూను సడలించామని.. ఎకనమిక్ యాక్టివిటీ కొనసాగాలని సీఎం వ్యాఖ్యానించారు. కరోనా పూర్తిగా తగ్గాకే జిల్లాల పర్యటన మొదలవుతుందని సీఎం తెలిపారు. అనుకున్న పనులన్నీ రెండు నెలల్లో పూర్తి కావాలని.. గ్రామానికి 2 సార్లు గ్రామ, వార్డు సచివాలయానికి వస్తానన్నారు. ఆర్టీపీసీఆర్ పరీక్షలు మాత్రమే చేయాలని జగన్ ఆదేశించారు. ఈ నెల 29న జగనన్న విద్యాదీవెన కార్యక్రమం జరుగుతుందన్నారు. వైఎస్సార్ భీమా అమలుపై ప్రత్యేక పరిశీలన చేయాలని జగన్ ఆదేశించారు.