Asianet News TeluguAsianet News Telugu

ఒకే స్కూళ్లో నలుగురు విద్యార్ధులకు కరోనా...ప.గో జిల్లా యంత్రాంగం అప్రమత్తం

తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు సమీపంలో ఉన్న శనివారపు పేట జిల్లా పరిషత్ హై స్కూల్లో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులు నలుగురికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. 

school students infected with corona at west godavari
Author
Amaravathi, First Published Mar 24, 2021, 3:41 PM IST

ఏలూరు: దేశవ్యాప్తంగానే కాకుండా ఆంధ్ర ప్రదేశ్ లోనూ మళ్లీ కరోనా కోరలు చాస్తోంది. ఇటీవల కాలంలో చాలా తక్కువగా నమోదయిన పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు సమీపంలో ఉన్న శనివారపు పేట జిల్లా పరిషత్ హై స్కూల్లో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులు నలుగురికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో ఈ జిల్లాలో కరోనా నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని  దృష్టి సారించారు. 

కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో జిల్లా యంత్రాంగాన్ని మరీముఖ్యంగా  వైద్యారోగ్య శాఖ అధికారులను అప్రమత్తం చేశారు మంత్రి.  జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజుతో ఫోన్లో మాట్లాడి శనివారపు పేట జిల్లా పరిషత్ స్కూల్ విద్యార్థులకు సెలవులు ప్రకటించాలని అదేశించారు. డిఎంహెచ్వో డాక్టర్ సునందతో మాట్లాడిన మంత్రి  కరోనా నివారణకు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ఆదేశించారు. 

కరోనా కేసులు బయటపడ్డ శనివారపు పేట పాఠశాలలో చదువుతున్న విద్యార్థులతో పాటు ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్ ఉన్న వారికీ కరోనా పరీక్షలు నిర్వహించాలని మంత్రి  సూచించారు. స్కూల్ ప్రాంగణంలో శానిటేషన్ చర్యలు చేపట్టాలని సూచించారు. కరోనా సోకిన విద్యార్థులను హోమ్ ఐసోలేషన్ లోనే వుంచాలని... ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకుంటూ వుండాలన్నారు. 24గంటల పాటు కరోనా బాధితులకు వైద్య సదుపాయం కల్పించాలని, నిరంతరం వైద్య సిబ్బంది పర్యవేక్షణ చేయాలని మంత్రి అదేశించారు.

read more   ఏపీ : విజయనగరం జిల్లాలో ఒకే స్కూలులో ఏడుగురికి పాజిటివ్ 

జిల్లాలో కరోనా వైరస్ కేసులు పెరిగితే తీసుకోవలసిన జాగ్రత్తలపై కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్, డిఎంహెచ్వోను మంత్రి అదేశించారు. అలాగే జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రైవేట్, ప్రభుత్వ హాస్పిటల్స్ లో కరోనా పేషెంట్స్ కి వైద్యం అందించేందుకు బెడ్స్ సిద్ధం చేసుకోవాలని సూచించారు. కరోనా నిబంధనలు తప్పనిసరిగా అమలు కావడానికి అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. 

జిల్లాలో ప్రతి రోజు 4వేల మందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని అధికారులు మంత్రికి తెలిపారు. జిల్లాలో అన్ని స్కూల్స్, హాస్టల్స్ కరోనా బాధితులకు ఐసోలేషన్ రూమ్స్ సిద్ధం చేయాలని మంత్రి ఆళ్ల నాని అదేశించారు. జిల్లాలో సెకండ్ వేవ్ వ్యాప్తి చెందకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. జిల్లా వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ 6లక్షలు మందికి అందించాలని లక్ష్యంగా చర్యలు చేపట్టామని... ఇంటింటికి సర్వే చేపట్టి ప్రతి ఒక్కరికి కరోనా వ్యాక్సిన్ అందేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రికి అధికారులు తెలిపారు. 
 
 

Follow Us:
Download App:
  • android
  • ios