స్కూల్ సిబ్బంది కొట్టడం వల్లే తమ బిడ్డ చనిపోయాడని తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగారు. స్కూల్ కిటికీలు పగులగొట్టారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకొని ఆందోళనకారులను చెదరగొట్టారు. ఈ ఘటన వైఎస్సాఆర్ జిల్లాలో చోటు చేసుకుంది. ఆ స్కూల్ అనుమతులను డీఈవో రద్దు చేశారు.
ఏపీలోని వైఎస్ఆర్ జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఖాజీపేట మండంలో కొత్తపేట ప్రాంతంలో ఉన్న బీరం శ్రీధర్ రెడ్డి స్కూల్ లో ఆరో తరగతి చదవి స్టూడెంట్ చనిపోయాడు. అయితే స్కూల్ సిబ్బంది కొట్టడం వల్లే తమ బిడ్డ చనిపోయాడని తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. వారికి విద్యార్థి సంఘాలు మద్దతు తెలిపాయి. వీరంతా కలిసి ఆందోళనకు దిగడంతో పోలీసులు అక్కడికి చేరుకొని లాఠీఛార్జీ చేశారు. దీంతో అక్కడ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
Jo Lindner : ప్రముఖ బాడీబిల్డర్ జో లిండ్నర్ అకాల మరణం.. అసలేం జరిగిందంటే..?
బాధిత కుటుంబ సభ్యులు, ‘ఈనాడు’ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. పులివెందులకు చెందిన నాగరాజు, లలిత దంపతుల 11 ఏళ్ల కుమారుడు సోహిత్ ఉన్నారు. ఆ బాలుడిని తల్లిదండ్రులు రెండు వారాల కిందట బీరం శ్రీధర్ రెడ్డి స్కూల్ లో ఆరో తరగతిలో చేర్పించారు. అయితే శనివారం ఉదయం సోహిత్ తండ్రికి కాల్ చేశాడు. తనకు కడుపు నొప్పిగా ఉందంటూ తెలిపాడు. దీంతో నాగరాజు వెంటనే కడపలో ఉండే చుట్టాలకు కాల్ చేసి విషయం చెప్పాడు. దీంతో వారు స్కూల్ కు వెళ్లారు. కానీ అప్పటికే అక్కడి సిబ్బంది బాలుడిని వరండాలో పడుకోబెట్టి ఉంచారు. అది చూసిన బంధువులు సోహిత్ ను బైక్ పై చెన్నూరు గవర్నమెంట్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అయితే బాలుడిని డాక్టర్లు పరిశీలించి, అప్పటికే బాలుడు చనిపోయాడని ప్రకటించారు.
తప్పుడు హామీల పట్ల జాగ్రత్త వహించండి : కాంగ్రెస్ పై ప్రధాని ఫైర్
అయితే బాలుడి పొత్తి కడుపుపై, చేతి వెనక వైపు కమిలినట్టుగా గాయాలు ఉన్నాయని తల్లిదండ్రులు గమనించి, స్కూల్ సిబ్బంది కొట్టడం వల్లే ఇలా జరిగిందని ఆరోపించారు. బాలుడి మృతదేహాన్ని స్కూల్ వద్దకు తీసుకువచ్చారు. అక్కడి సిబ్బంది లోపలకు అనుమతించలేదు. దీంతో అక్కడ కాసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. స్కూల్ కాంప్లెక్స్ లో కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన చెప్పట్టారు. కానీ స్కూల్ మేనేజ్మెంట్ అక్కడి నుంచి పారిపోయింది. కొంత సమయం తరువాత పోలీసులు అక్కడికి చేరుకొని ఆందోళనకారులను చెదరగొట్టారు. అందరికీ నచ్చజెప్పి, డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం గవర్నమెంట్ హాస్పిటల్ కు పంపించారు.
ట్విట్టర్ సేవలకు అంతరాయం .. సోషల్ మీడియాలో ఫిర్యాదుల వెల్లువ..
తరువాత వీరంతా వెళ్లి నేషనల్ హైవేపై ఆందోళనకు దిగారు. పోలీసులు అక్కడికీ చేరుకొని నిరసనకారులను పంపించివేశారు. కాగా.. ఈ ఘటనపై డీఈవో రాఘవరెడ్డి సీరియస్ అయ్యారు. పాఠశాల అనుమతులను రద్దు చేశారు. అక్కడి చదివే విద్యార్థులను వేరే స్కూల్స్ లో సర్దుబాటు చేసేందుకు తల్లిదండ్రుల సమావేశం నిర్వహించాలని తెలిపారు. ఈ ఘటనపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని కోరుతూ ఐదుగురితో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు.
