ప్రభుత్వ వైన్‌షాపులో సిబ్బంది చేతివాటం.. ఫోర్జరీ సంతకాలతో లక్షలు స్వాహా
విశాఖలోని ప్రభుత్వ మద్యం దుకాణాల్లో సూపర్ వైజర్, సేల్స్ సిబ్బంది కలిసి లక్షల రూపాయలు కాజేశారు. ఎక్సైజ్ సర్కిల్ 4 పరిధిలోని ఆర్ అండ్ బీ శాంతిపురం షాపులో అవకతవకలు జరిగాయి.
విశాఖలోని ప్రభుత్వ మద్యం దుకాణాల్లో సూపర్ వైజర్, సేల్స్ సిబ్బంది కలిసి లక్షల రూపాయలు కాజేశారు. ఎక్సైజ్ సర్కిల్ 4 పరిధిలోని ఆర్ అండ్ బీ శాంతిపురం షాపులో అవకతవకలు జరిగాయి. దీనిపై ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ విచారణ జరిపారు. వైన్ షాపు సూపర్ వైజర్ శ్యామ్ అక్రమాలకు పాల్పడినట్లుగా తేలింది. ఎస్‌బీఐ సిబ్బంది సంతకం, స్టాంప్‌లను ఫోర్జరీ చేసినట్లుగా గుర్తించారు. ఇలా 8.50 లక్షలను కాజేసినట్లుగా దర్యాప్తులో తేలింది. ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్‌పెక్టర్ నాగ శ్రీనివాస్ ప్రమేయం వున్నట్లుగా ప్రాథమికంగా నిర్ధారించారు. పూర్తి ఆధారాలు లభిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు.